Homeఎంటర్టైన్మెంట్Dil Raju lying about Toxic: 'టాక్సిక్' మూవీ విషయంలో దిల్ రాజు పచ్చి అబద్దాలు...

Dil Raju lying about Toxic: ‘టాక్సిక్’ మూవీ విషయంలో దిల్ రాజు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడా..?

Dil Raju lying about Toxic: సినిమాని పబ్లిసిటీ చేసే విషయం లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని సినిమాలకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కువ వసూళ్లు వచ్చాయని పోస్టర్స్ లో చూపించి జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఈమధ్య కాలం లో ఇది సర్వసాధారణం అయిపోయింది. జనాలను థియేటర్స్ కి రప్పించే టెక్నీక్స్ లో ఇదొకటి పద్దతి అనుకోవచ్చు. కొంతమంది అయితే ఫ్లాప్ సినిమాలకు కూడా భారీ వసూళ్లు వచ్చాయని పోస్టర్లు దింపి నవ్వులపాలు అయ్యారు. అందుకు బెస్ట్ ఉదాహరణ దిల్ రాజు(Dil Raju). గత ఏడాది ఆయన ఏ సినిమాకు అలాంటి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ వేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరోసారి కూడా ఆయన అలా ఫేక్ ప్రచారం తో తన సినిమాకు పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన కన్నడ హీరో యాష్(Rocking Star Yash) నటించిన ‘టాక్సిక్'(Toxic Movie) మూవీ తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేశాడు.

ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపుగా 120 కోట్లు ఖర్చు చేసానని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఆయన పాల్గొన్న ఒక ప్రెస్ మీట్ లో విలేఖరి ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు టాక్సిక్ చిత్రాన్ని 120 కోట్ల రూపాయలకు కొన్నాను అని చెప్పుకొచ్చారు. ఇది సినిమా కోసం కేవలం మీరు ఉపయోగించిన పబ్లిసిటీ స్టంట్ అని అందరూ అంటున్నారు, దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు?’ అని అడగ్గా, దానికి దిల్ రాజు సమాధానం చెప్తూ ‘త్వరలోనే వాళ్లకు నా అకౌంట్ నుండి డబ్బులు పంపబోతున్నాను. అప్పుడు ఇలా కామెంట్ చేసినవాళ్లందరికీ చూపిస్తాను, అప్పుడు అర్థం అవుతుంది ఏది నిజం, ఏది అబద్దం అనేది’ అంటూ దిల్ రాజు వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. అంటే ఆయన ఈ పబ్లిసిటీ ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నాడు. యాష్ గత చిత్రం ‘KGF చాప్టర్ 2’ భారీ హైప్ తో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే 85 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చింది.

అలాంటిది ‘టాక్సిక్’ చిత్రానికి ఇంత రేట్ పెట్టి కొనడమా?, దిల్ రాజు కచ్చితంగా జనాల చెవిలో పువ్వు పెడుతున్నాడు, అందులో ఎలాంటి సందేహం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. ఆయన ఇది కేవలం హైప్ కోసమే చేసాడని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలయ్యే రోజునే ‘ధురంధర్ 2’ చిత్రం విడుదల కాబోతుంది. ఆ తర్వాత వారం రోజులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదల కాబోతుంది. భారీ పోటీ ఉన్నందున, ఆ పోటీ ని తట్టుకోవడం కోసం, తమ సినిమాకు తెలంగాణ టికెట్ హైక్స్ కోసం దిల్ రాజు ఆడిన ఆట ఇది అని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper
Exit mobile version