Homeఎంటర్టైన్మెంట్Jagapathi Babu Peddi look: 'పెద్ది' లుక్ తో టీ స్టాల్ కి వెళ్తే నన్ను...

Jagapathi Babu Peddi look: ‘పెద్ది’ లుక్ తో టీ స్టాల్ కి వెళ్తే నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు – జగపతి బాబు

Jagapathi Babu Peddi look: ప్రస్తుతం మన టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది'(Peddi Movie). గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాబోతుంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా అన్ని భాషల్లోనూ విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అభిమానులు రెండవ పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు . ఈ శివరాత్రికి విడుదల చేస్తారని అంతా అనుకున్నారు కానీ, మార్చి మొదటి వారానికి అది పోస్ట్ పోన్ అయ్యింది. ఇకపోతే ఈ చిత్రం లో జగపతి బాబు(Jagapathi Babu) ‘అప్పలసూరి’ అనే క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. అందులో జగపతి బాబు లుక్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు అది జగపతి బాబు అంటే నమ్మడం కష్టం, ఆ రేంజ్ లో మేకప్ చేశారు. నిన్న జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా, ఈ చిత్రం లో ఆయన డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి చర్చిస్తున్న వర్కింగ్ స్టిల్ ని ఒకటి విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు ఎవరినో పట్టుకొని, జగపతి బాబు అంటారేంటి?, అసలు ఎవరైనా నమ్మేలాగా ఉందా ఆ లుక్? అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అయితే ఈ లుక్ పై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జగపతి బాబు ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకోగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘ఒక రోజు నేను పెద్ది చిత్రం షూటింగ్ ముగియగానే, అప్పలసూరి లుక్ తోనే బయటకు వెళ్లి ఒక టీ స్టాల్ వద్ద ఆగి టీ తాగాను. ఒక్కరు కూడా నేను జగపతి బాబు అనే విషయాన్నీ గుర్తు పట్టలేదు. దానిని మేము వీడియో కూడా షూట్ చేశాము. చాలా బాగా వచ్చింది. సినిమా విడుదలైన తర్వాత ఆ వీడియో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు జగపతి బాబు. ఈ క్యారెక్టర్ తన కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ లాగా మిగిలిపోతుందని, ఇలాంటి పాత్ర పోషించే అవకాశం ఇచ్చినందుకు బుచ్చి బాబు కి ధన్యవాదాలు అంటూ ఆయన ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు . అయితే ఈ క్యారెక్టర్ పాజిటివ్ గా ఉంటుందా?, లేదా నెగటివ్ గా ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version