Devi Sri Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు… నిజానికి ఒక సినిమా సక్సెస్ లో హీరోలతో పాటు దర్శకులు కూడా కీలకపాత్ర వహిస్తారు. ఇక వాళ్ళిద్దరితోపాటు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అత్యంత క్రియాశీలకమైన పాత్ర వహిస్తాడనే చెప్పాలి. కారణం ఏంటి అంటే ఒక సినిమాలో సాంగ్స్ బాగున్నప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాను చూడడానికి థియేటర్ కి వస్తారు. అలాగే సినిమా బ్యా గ్రౌండ్ స్కోర్ బాగుంటేనే సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలైన ఎలివేషన్ సీన్స్ అయిన వర్కౌట్ అవుతాయి.
ఇలాంటి క్రమంలోనే దాదాపు 25 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన మ్యూజిక్ తో ప్రాణం పోసిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్…ప్రస్తుతం ఆయన వేణు ఎల్దండి డైరెక్షన్లో ఎల్లమ్మ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు… ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలను చేసే అవకాశాలు లేవు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
కానీ మరికొందరు మాత్రం దేవి సినిమా హీరోగా చేసుకుంటూనే ఇటు కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు అంటూ మరి కొంతమంది చెబుతున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో జీవి ప్రకాష్ కుమార్ ఎలాగైతే తను హీరోగా చేస్తూనే మిగతా కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడో దేవిశ్రీప్రసాద్ కూడా అదే బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక తన చేస్తున్న ఎల్లమ్మ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని సంక్రాంతి పండగ రోజున సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసినట్టుగా తెలుస్తోంది… ఇక గ్లింప్స్ తోనే దేవిశ్రీప్రసాద్ హీరోగా సెట్ అవుతాడా? లేదా అనే విషయంలో అందరికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వేచి చూడాల్సిన సమయమైతే ఉంది…