Chiranjeevi visit Paradise movie set: మన శంకర వరప్రసాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చిరంజీవికి రానటువంటి ఒక గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను తీసిన అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అవతరించాడు. మెగాస్టార్ కి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన దర్శకులలో అనిల్ రావిపూడి కూడా చేరిపోయాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. చిరంజీవి ఇక మీదట చేయబోయే సినిమాలను 100% సక్సెస్ రేట్ ఉండే విధంగా చూసుకుంటున్నాడు. కాబట్టి తన తదుపరి సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత ప్యారడైజ్ సినిమా షూటింగ్ అయితే ఈనెల 20వ తేదీ నుంచి జరగబోతుంది. ఇక ప్యారడైజ్ సినిమా సెట్స్ కి చిరంజీవి అనిల్ రావిపూడి వెళ్లనట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్ సైతం వాళ్ళను ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.
ఇక చిరంజీవి సెట్ కి వెళ్లి నాని, శ్రీకాంత్ ఓదెలను కలిసి అక్కడ హంగామా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల మాస్ దర్శకుడిగా అవతరిస్తాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటాడా? తద్వారా చిరంజీవితో చేయబోయే సినిమాకి లైన్ క్లియర్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
గ్లింప్స్ తోనే ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి నెలలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక అనుకున్న టైమ్ కి సినిమాని తీసుకొస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ అయితే చేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే తను పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది.
మార్చి 26 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ ముందే అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ డేట్ కి ఈ సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి సినిమాను కూడా ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి తనకున్నట్టుగానే చిరంజీవిని టాప్ రేంజ్ లో చూపిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…