https://oktelugu.com/

Jupiter: గురు గ్రహంపై రెడ్ స్పాట్.. భూమికి ముప్పు తప్పదా?

గురు గ్రహం పై తుఫాన్లు ఏర్పడ్డాయి. ఇవి గ్రహం మొత్తాన్ని విస్తరించాయి. జునో మిషన్ ఈ చిత్రాలను బంధించింది. గురు గ్రహం పై ఘనమైన ఉపరితల ప్రదేశం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 23, 2024 / 03:04 PM IST

    Red-spot-on-Jupiter

    Follow us on

    Jupiter: అంతరిక్షం.. అనేక అద్భుతాల పుట్ట. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంత.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒక్కో ఆశ్చర్యం. అంతరిక్షంలో నిత్యం మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటివి కొన్ని మన భూ గ్రహానికి చేటు చేస్తే.. మరికొన్ని మన భూమికి మంచి చేస్తాయి. అయితే ప్రస్తుతం సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుడి పై భారీ తుఫాన్లు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించిన ఫోటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(NASA) తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది.. ఈ ఫోటో విడుదల చేసిన నేపథ్యంలో.. ఆ తుఫాన్ల వల్ల భూగ్రహానికి ఏమైనా ముప్పు పొంచి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే దీనిపై నాసా క్లారిటీ ఇచ్చింది.

    ” గురు గ్రహం పై తుఫాన్లు ఏర్పడ్డాయి. ఇవి గ్రహం మొత్తాన్ని విస్తరించాయి. జునో మిషన్ ఈ చిత్రాలను బంధించింది. గురు గ్రహం పై ఘనమైన ఉపరితల ప్రదేశం లేదు. కాబట్టి తుఫాన్లు వెంటనే ముగిసిపోవు. కొన్నిసార్లు నెలలు, ఇంకా కొన్నిసార్లు సంవత్సరాలు , మరికొన్ని సార్లు సంవత్సరాలపాటు సాగుతుంటాయి. గంటకు 643 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీస్తాయి. అయితే వీటివల్ల భూగ్రహానికి పెద్దగా ముప్పు ఏముండదు. అయితే ఆ గ్రహంలో ఆక్సిజన్ వంటిది ఉండదు కాబట్టి.. తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుంది. జంతుజాలం జీవించేందుకు అవకాశం లేదు కాబట్టి.. నష్టం ఎంతనేది చెప్పే అవకాశం ఉండదని” నాసా ప్రకటించింది.

    గురు గ్రహం పై వీచే బలమైన గాలులకు సంబంధించిన ఫోటోలను జునో తీసింది. ఫోటోలు తీసిన సమయంలో నాసా జునో శాటిలైట్ గురు గ్రహం పై ఏర్పడిన మబ్బుల పైనుంచి 13 వేల కిలోమీటర్ల ఎత్తులో వెళ్తోంది.. గురు గ్రహం పై ఏర్పడే మేఘాలలో అమోనియా, హైడ్రోజన్, హీలియం, నీరు అధికంగా ఉంటాయి. గురు గ్రహంపై ఈ గాలులు విస్తరించి ఉంటాయని” నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా విడుదల చేస్తున్న ఫోటోల్లో తెలుపు, నీలం రంగుల్లో మబ్బులు కనిపిస్తున్నాయి. ఆ మబ్బుల వల్ల అక్కడి వాతావరణం అత్యంత అల్లకల్లోలంగా ఉంది.. ఫలితంగా అక్కడ గ్రేట్ రెడ్ స్పాట్ ఏర్పడింది. దానిని నాసా జునో శాటిలైట్ 13, 917 కిలోమీటర్ల ఎత్తు నుంచి చిత్రీకరించింది.

    ఈ రెడ్ స్పాట్ భూ పరిమాణంతో పోల్చితే రెండింతలు పెద్దగా ఉంది. అనాస శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం రెడ్ స్పాట్ అనేది ఒక తుఫాను. గత 350 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. గత 150 సంవత్సరాల నుంచి దీని సైజు క్రమంగా తగ్గుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు పాలు సందర్భాల్లోనూ గురు గ్రహం అనేక వింతలకు ఆలవాలంగా మారిందని.. అది ఆశ్చర్యపరుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.