Akhil Lenin Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు ఒకప్పుడు రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. అతని తర్వాత తన నట వారసుడిగా వచ్చిన నాగార్జున సైతం డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నాగార్జున ఇప్పుడు కూడా తనదైన రీతిలో కొత్త తరహా కథలను ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు… తన నట వారసులు అయిన నాగచైతన్య, అఖిల్ సైతం గొప్ప సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను కొంతవరకు మెప్పిస్తున్నప్పటికి మరికొన్ని సినిమాల విషయంలో వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటివరకు తన కెరియర్ లో గర్వంగా చెప్పుకోవడానికి కొన్ని ఒక సక్సెస్ ఫుల్ సినిమా కూడా లేదు.
దాంతో అతను చాలావరకు డీలాపడిపోయాడు తన తోటి హీరోలందరు సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే ఆయన మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు…ఇక ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ‘మురళి కిషోర్’ అనే దర్శకుడు డైరెక్షన్ చేయడం విశేషం…
అయితే దర్శకుడు అక్కడక్కడ తడబడిన కూడా అఖిల్ తనకు సపోర్ట్ ని ఇస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడట. మొత్తానికైతే అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మాత్రం మరొక ఎత్తుగా మారబోతుంది అనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. తను ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నింటి కంటే కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…
రా అండ్ రస్టిక్ స్టోరీ తో సాగబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక అఖిల్ ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడం బాగానే ఉంది… కానీ సినిమా డైరెక్షన్లో ఏదైనా వేలు పెడితేనే ప్రాబ్లం వస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
