Anil Ravipudi new movie: రాజమౌళి(SS Rajamouli) తర్వాత మన టాలీవుడ్ లో ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న ఏకైక డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi). రాజమౌళి భారీ బడ్జెట్ గ్రాండియర్ సినిమాలతో ఆ ఫీట్ ని అందుకుంటే, అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో ఈ అరుదైన ఫీట్ ని అందుకున్నాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన అనిల్ రావిపూడి, ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో మరో 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో పని చేయబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిన్న మొన్నటి వరకు ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
అది నిజం కాదని, విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ చిత్రం చేయబోతున్నాడని, ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాను, ఒక నాలుగు వారాలు ఈ సినిమా సంబరాల్లో మునిగి తేలిన తర్వాత భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచిస్తా అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో వార్త సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నావు, మా అక్కినేని నాగార్జున తో కూడా ఒక సినిమా చేసి సూపర్ హిట్ ఇవ్వొచ్చు కదా అని అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అనిల్ రావిపూడి ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.
అయితే అక్కినేని నాగార్జున తో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు కానీ, ఆయన తనయుడు అక్కినేని అఖిల్ తో అనిల్ తదుపరి సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటించబోతుంది అట. కెరీర్ ని మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అఖిల్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అఖిల్ కి అర్జెంటు గా హిట్ కావాలి, అందుకు అనిల్ రావిపూడి నే కరెక్ట్ అని నాగార్జున ఫిక్స్ అయ్యి, అనిల్ ని రిక్వెస్ట్ చేసాడట. నాగార్జున స్థాయి వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే ఇక ఈ సినిమా లేకుండా ఎలా ఉంటుంది?, అనిల్ ,అఖిల్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.
