Vijay Deverakonda : కొన్నేళ్ల నుండి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) ప్రేమ వ్యవహారం గురించి ఎన్ని కథనాలు వచ్చి ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే విషయం నిజమని ప్రతీ ఒక్కరికి తెలుసు. కానీ వీళ్ళు మాత్రం బయటపడరు. మా రిలేషన్ గురించి అందరికీ ఒక క్లారిటీ ఉందనే విషయం అటు రష్మిక కి, ఇటు విజయ్ దేవరకొండ ఉంది, అయినా కూడా వీళ్ళు తమ రిలేషన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయరు. అసలు ఎందుకు ఇంత దాచుతున్నారు?, కలిసి జీవిస్తున్నప్పుడు ధైర్యంగా దాని గురించి చెప్పేయొచ్చు కదా అని వీళ్ళ అభిమానుల్లో కూడా మెలిగే ప్రశ్న. రీసెంట్ గానే ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ రష్మిక ని ఇంటర్వ్యూ చేసింది.
ఈ ఇంటర్వ్యూ లో జర్నలిస్ట్ ప్రేమ రష్మిక ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు కచ్చితంగా నిజమే చెప్పాలి. ఆ ప్రశ్న ఏమిటంటే గత రెండు మూడేళ్ళ నుండి విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమించుకుంటున్నారు , నిశ్చితార్థం కూడా చేసుకున్నారు, పెళ్లి తేదీ కూడా వచ్చేసింది , వచ్చే నెల 26 న ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకుంటున్నారట. దీని గురించి మిమ్మల్ని మేము ఎప్పుడు అడిగినా సిగ్గు పడుతూ, నవ్వుతు, సమాధానం దాటేసేవారు, కానీ ఈరోజు మీరు ఇక్కడ నిజం చెప్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఈ వార్తని ఖండించడం లేదు, అలా అని ఒప్పుకోవడం కూడా లేదు, మమ్మల్ని అందరినీ ఒక కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు, కానీ ఎదో ఒకటి చెప్పాలి ఈసారి ‘ అని అడుగుతుంది.
దానికి రష్మిక సమాధానం చెప్తూ ‘నిజం చెప్పాలంటే ఒక నాలుగేళ్ల నుండి ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా దీని గురించే అడుగుతున్నారు. కానీ దీని గురించి నేను మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాను’ అని అంటుంది. అప్పుడు ప్రేమ ‘మీరు ప్రతీ సారీ అదే చెప్తున్నారు, ఇది చాలా అన్యాయం, నేను మీకు మంచి స్నేహితురాలు కదా , నాకు చెప్పొచ్చు కదా’ అని అంటుంది. అందుకు రష్మిక ‘అవునండీ..కానీ ఆఫ్ ది రికార్డు లో మాట్లాడుకుందాం దీని గురించి’ అని అంటుంది రష్మిక. అంటే వీళ్ళు రిలేషన్ లో ఉన్నారని మరోసారి చెప్పకనే చెప్పేసింది రష్మిక. కానీ అందరికీ తెలిసిన విషయాన్నీ ఎందుకు ఇంత సాగదీస్తున్నారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. వచ్చే నెలలో పెళ్లి అంటున్నారు, కనీసం పెళ్లి చేసుకునే విషయం అయినా చెప్తారా?, లేదా నిశ్చితార్థం లాగా సీక్రెట్ గా చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB
— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026
