Vijay Theri Re Release : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విజయ్ కావడం విశేషం…ఇక విజయ్ ‘తమిళగా వెట్రీ కజగం’ అనే పొలిటికల్ పార్టీని పెట్టి రాజకీయ ఎంట్రీ ఇచ్చాడు… ఇక తను సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాను అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. చివరి సినిమాగా బాలయ్య బాబు హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాను ‘జన నాయగన్’ అనే పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో సినిమా యూనిట్ కోర్టునైతే ఆశ్రయించింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు సైతం ఈ కేసు విషయాన్ని లోకల్ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని తీర్పునిచ్చింది.
దాంతో తమిళనాడు హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది… ఇక ఈ సినిమా రిలీజ్ కి ఇంకా ఎన్ని రోజులు పడుతుందనే విషయంలో సినిమా మేకర్స్ కి క్లారిటీ రావడం లేదు. దాంతో విజయ్ అభిమానులు చాలా వరకు నిరాశపడుతున్నారనే ఉద్దేశ్యంతో విజయ్ సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘తేరి’ సినిమాను రీరిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో తేరి సినిమా ప్రొడ్యూసర్స్ అయితే ఉన్నారు…
ఇక ఈ సినిమా గతంలోనే ‘పోలీస్’ అనే పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు తమిళ్, తెలుగు రెండు భాషల్లో ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు. జనవరి 23వ తేదీన ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో సైతం కొత్త రికార్డులను క్రియేట్ చేయగలుగుతుంది అంటూ విజయ్ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో విజయ్ మరోసారి తన సత్తాను చాటుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తేరి సినిమాకి రీమేక్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వస్తుందంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి… నిజంగానే ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కితే తేరి సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మీద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…
