Irumudi Ravi Teja: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ స్క్రిప్ట్స్ ఎంపిక పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. ‘మాస్ జాతర’ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ రవితేజ గత చిత్రాల ప్రభావం ఈ సినిమాపై చాలా బలంగా పడింది. పైగా ఈ చిత్రం తో పాటు విడుదలైన మరో రెండు సినిమాలకు ఇంకా ఎక్కువ పాజిటివ్ టాక్ రావడం తో, ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది ఈ సినిమా. కానీ రవితేజ అభిమానులకు మాత్రం ఈ సినిమా బిగ్ రిలీఫ్ అనే అనుకోవాలి. ఈ సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది, కానీ రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ లో మార్పు వచ్చింది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో భారీ హిట్ కొడుతాడనే నమ్మకం వచ్చింది అంటూ సోషల్ మీడియా లో రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే రవితేజ అతి త్వరలోనే శివ నిర్వాణ దర్శకత్వం లో ‘ఇరుముడి’ అనే చిత్రం చేయబోతున్నాడు. శివ గతం లో నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. అలాంటి డైరెక్టర్ తో రవితేజ సినిమా చేస్తుండడం తో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం కలిగింది. ఇకపోతే ఈ చిత్రం లో రవితేజ ఒక కూతురికి తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం లో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడట. కూతురు కోసం ఎంత పోరాటం అయినా చేయడానికి సిద్ధమయ్యే క్యారెక్టర్ లో ఆయన నట విశ్వరూపం చూపించబోతున్నాడట. ఒక టాలీవుడ్ టాప్ హీరో ఈ చిత్రం లో విలన్ గా నటిస్తాడని టాక్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది సమాచారం.
ఇకపోతే ఈ చిత్రానికి కాంతారా సిరీస్ ఫేమ్ అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడట. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరూ ముట్టుకొని కొన్ని సున్నితమైన అంశాలను ఈ చిత్రం లో డైరెక్టర్ చూపించబోతున్నాడని, ఆయన విజన్ కి తగ్గట్టు 20 శాతం తీసినా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయని, రవితేజ కం బ్యాక్ ఈసారి కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా, పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందని సమాచారం. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరు?, విలన్ గా నటించబోయే ఆ టాప్ హీరో ఎవరు వంటి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.