Acharya: ‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్కు రెడీగా ఉన్నారా?
Acharya: కొరటాల శివ, మెగస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. పైగా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. వీళ్లకు జంటగా కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. కాగా, ఇటీవల విడుదల చేసిన […]
Acharya: కొరటాల శివ, మెగస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. పైగా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. వీళ్లకు జంటగా కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది.
కాగా, ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ లాహే లాహే.. తాజాగా 100 మిలియన్ల వ్యూస్‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ హ్యాపీ మూమెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ను కూడా అందించారు మేకర్స్. త్వరలోనే ఓ అదిరే అప్డేట్ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రామ్‌చరణ్ నటించిన సిద్ధ పాత్రకు సంబంధించి ఈ అప్డేట్ ఉండబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చారు. మరి అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ఈ అప్డేను ఎప్పుడు వదులుతారో వేచి చూడాలి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ” కి ఒకే చెప్పగా… బాబీతో చేయబోయే సినిమాకి ” వాల్తేరు వాసు ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరోవైపు, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చెర్రి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.