Naga Chaitanya: అక్కినేని వంశ నటవారసుడు నాగ చైతన్య పుట్టినరోజు నేడు. 1985 నవంబర్ 23న జన్మించిన నాగ చైతన్య 35వ బర్త్ డే జరుపుకుంటున్నారు. హీరోగా దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న నాగ చైతన్య తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కెరీర్లో విజయాలు అపజయాలు ఎదుర్కొన్నారు. లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్న నాగ చైతన్య, గత మూడు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ చిత్రాలతో ఆయన హ్యాట్రిక్ నమోదు చేశారు. 20 చిత్రాలకు పైగా చేసిన నాగ చైతన్య కెరీర్ లో చేసిన అత్యుత్తమ చిత్రాలు ఏమిటో చూద్దాం..
2009లో విడుదలైన జోష్ మూవీతో నాగ చైతన్య హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జోష్ తెరకెక్కింది. స్టూడెంట్స్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన జోష్ చిత్రం నాగ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘శివ’ను పోలి ఉంటుంది. జోష్ మూవీ కమర్షియల్ గా ఆడకపోయినా, చైతన్య నటుడిగా నిరూపించుకున్నాడు.
ఏమాయ చేశావే చిత్రంతో చైతన్య ఫస్ట్ హిట్ కొట్టాడు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. సమంత హీరోయిన్ గా పరిచయమైన ఈ మూవీ యూత్ కి తెగ నచ్చేసింది. ఏ ఆర్ రెహమాన్ సాంగ్స్ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
చైతూకి ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో 100% లవ్ ఒకటి. చైతూ మూడో చిత్రంగా తెరకెక్కించిన 100 % లవ్ భారీ విజయం సొంతం చేసుకుంది. చైతూకి యూత్ లో ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ ఇది. ఇగోయిస్టుగా చైతూ తన నటనతో అబ్బురపరిచారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి దేవిశ్రీ సంగీతం ప్లస్ అయ్యింది.
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులు కలిసి నటించిన ‘మనం’ మూవీ ఓ అద్భుతం. దర్శకుడు విక్రమ్ కుమార్ తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగా, మనం భారీ విజయం అందుకుంది. చైతూ రెండు భిన్నమైన రోల్స్ లో నటించి ఆకట్టుకున్నారు. చైతూ కెరీర్ లో బెస్ట్ మూవీగా మనం నిలిచిపోయింది.
మనం మూవీ తర్వాత చైతూ వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. మరలా కలిసొచ్చిన జోనర్ లోనే మూవీ చేసి హిట్ ట్రాక్ ఎక్కాడు. మలయాళ హిట్ మూవీ ప్రేమమ్ కి రీమేక్ గా తెరకెక్కిన ప్రేమమ్ చైతు ని పరాజయాల నుంచి బయటపడేసింది.
నాగ చైతన్య నటనకు తార్కాణంగా నిలుస్తుంది మజిలీ చిత్రం. భగ్న ప్రేమికుడిగా చైతూ నటన పీక్స్ అని చెప్పాలి. సమంత, చైతూ పోటీపడి మరీ నటించారు. నాగ చైతన్య కెరీర్ లో మజిలీ బెస్ట్ మూవీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.
Also Read: Punith Rajkumar: త్వరలోనే పునీత్ రాజ్‌కుమార్ బయోపిక్.. డైరెక్టర్ ఎవ్వరటే?
ఇక నాగ చైతన్య లేటెస్ట్ హిట్ లవ్ స్టోరీ సూపర్ హిట్ అందుకుంది. పాండమిక్ పరిస్థితుల తర్వాత యూత్ ని థియేటర్స్ కి రప్పించిన చిత్రం ఇది. దర్శకుడు శేఖర్ కమ్ముల క్యాస్ట్ ఫీలింగ్, ఆడవాళ్లపై లైంగిక దాడులు అనే అంశాలు టచ్ చేస్తూ… ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. నాగ చైతన్య కెరీర్ భారీ వసూళ్లు రాబట్టిన మూవీగా లవ్ స్టోరీ రికార్డులకు ఎక్కింది.
Also Read: Shyam Singaroy Movie: భారీ ధరకు నాని “శ్యామ్ సింగరాయ్” మూవీ ఓటిటి హక్కులు…