https://oktelugu.com/

Bangarraju: ఇంటర్వ్యూ: ‘బంగార్రాజు’ హిట్టయితేనే ఆ ఛాన్స్..!

Bangarraju: 2022 సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘బంగ్రారాజు’ మూవీ రాబోతుంది. జనవరి 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజు కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ను చిత్రబృందం భారీ ప్రచారం చేపడుతోంది. ఇందులో భాగంగానే నాగార్జున మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘బంగ్రారాజు’కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు. * పెద్ద బంగార్రాజు, చిన్న బంగార్రాజు ఎలా అలరించబోతున్నారు? నాగార్జున: ఆ సినిమాకు, ఈ సినిమాకు ఉన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 13, 2022 / 05:23 PM IST
    Follow us on

    Bangarraju: 2022 సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘బంగ్రారాజు’ మూవీ రాబోతుంది. జనవరి 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజు కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ను చిత్రబృందం భారీ ప్రచారం చేపడుతోంది. ఇందులో భాగంగానే నాగార్జున మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘బంగ్రారాజు’కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు.

    * పెద్ద బంగార్రాజు, చిన్న బంగార్రాజు ఎలా అలరించబోతున్నారు?

    నాగార్జున: ఆ సినిమాకు, ఈ సినిమాకు ఉన్న మార్పే ఇది. అప్పుడు పెద్ద బంగ్రారాజు ఎంటరైనట్లుగానే ఈమూవీలో చిన్న బంగార్రాజు ఎంటర్ అవుతాడు. చిన్నబంగార్రాజుకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

    * చైతూ రోల్ కావాలనే పెట్టారా?

    నాగార్జున: మొదటి పార్ట్ లో తండ్రి, కొడుకుగా నేనే చేశా. ఆ తండ్రి కొడుల బంధం ‘బంగ్రారాజు’లోనూ కొనసాగుతుంది. చైతుతో నా కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది.

    * రమ్య కృష్ణతో మీ ఎక్స్ పీరియన్స్ చెప్పండి?

    నాగార్జున: మా ఇద్దరి కాంబినేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఈసారి కూడా మా కాంబో అలరిస్తుంది. తను సెట్స్ లో చాలా సరదాగా ఉంటుంది.

    * కృతిశెట్టి గురించి చెప్పండి?

    నాగార్జున: చాలా తక్కువ టైంలో తను తెలుగు నేర్చుకుంది. నటన పరంగా చాలా ప్రొఫెషినల్. ఈ సినిమాలో ఆమెకు మంచి రోల్ దక్కింది. ఈ మూవీ తనకు కెరిర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

    * చైతు పెర్ఫామెన్స్ పై మీ అభిప్రాయం?

    నాగార్జున: చైతూ బంగార్రాజు లాంటి బోల్డ్ ఇంట్రెస్టింగ్ రోల్ ని చెయ్యగలడని అనుకోలేదు. నేనే బలవంతం పెట్టి ఈ మూవీకి చేయించాను. ఇందులో చైతూ బెస్ట్ ఇచ్చాడు.

    * ఏపీలోని టికెట్ రేట్లపై మీ కామెంట్?

    టికెట్ల రేట్ల తగ్గింపు జీవో ఏప్రిల్ లో వచ్చింది. మేము షూటింగ్ ఆగష్టు లో స్టార్ట్ చేశాం. ఆ రేట్స్ కి తగ్గట్టుగానే మా సినిమాని బడ్జెట్ ప్లాన్ చేశాం. అందుకే ఈ రేట్లు తో మా సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

    * బంగార్రాజుకు సీక్వెల్ ఉంటుందా?

    నాగార్జున: సోగ్గాడే చిన్ని నాయనా కూడా సోలో గానే ప్లాన్ చేసాం. కానీ దానికి సీక్వెల్ వచ్చింది. బంగార్రాజు ఆత్మ సినిమాలో ఎక్కడికైనా వస్తుంది. సో ఈ మూవీ హిట్ అయితే సీక్వెల్ ఉండొచ్చు.