Prabhas: సినిమా హీరోలు అనగానే అంతా సుఖాలే ఉంటాయి. పైగా కోట్ల రూపాయల సంపాదన ఉంటుందనే ముద్ర బాగా పడిపోయింది. నిజానికి సినిమా హీరోలకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. తీరిక లేని షెడ్యూల్స్ తో సరైన నిద్ర, విశ్రాంతి కూడా వాళ్లకు ఉండదు. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడూ అవుట్ డోర్స్ లో గడపాలి. పాత్రకు తగ్గట్టుగా శరీర బరువులో మార్పులు చేసుకోవాలి. దీని కోసం విపరీతమైన వ్యాయామం చేయాలి. ఇష్టమైన ఫుడ్ ని వదిలేయాలి. ఇవన్నీ చేసినా అవకాశాలు ఎన్ని రోజులు వస్తాయో తెలియదు.

పైగా ప్రమాదకరమైన పోరాట సన్నివేశాలలో హీరోలు పాల్గొనాలి. స్టార్స్ కలర్ ఫుల్ లైఫ్ వెనుక ఇంతటి కష్టం ఉంటుంది కాబట్టే.. హీరోలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. దీనికి తోడు విదేశీ ప్రయాణాలు హీరోల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దాని కారణంగా తరచుగా ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి కూడా వస్తోంది. అందుకే టాలీవుడ్ కి చెందిన స్టార్స్ కు సర్జరీలు అలవాటు అయిపోయాయి.
Also Read: ఇంటర్వ్యూ: ‘బంగార్రాజు’ హిట్టయితేనే ఆ ఛాన్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ చేస్తూ ఉండగా ఆయన కుడి చేతి వేళ్ళకు గాయమైంది. డాక్టర్స్ చేతికి సర్జరీ చేశారు. నటసింహం బాలయ్య ఎడమ చేతికి సర్జరీ జరిగింది. స్టార్ హీరో మహేష్ కూడా కాలుకు సర్జరీ జరిగింది. మహేష్ కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడ్డాడు. ఓ దశలో నడవడానికి ఇబ్బంది పడ్డాడు.ఈ తరుణంలో డాక్టర్స్ సర్జరీ అవసరమంటే.. రెండు నెలల క్రితం మహేష్ సర్జరీ చేయించుకున్నాడు.
అయితే, తాజాగా మరో స్టార్ హీరో ప్రభాస్ కూడా సర్జరీకి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ చేతికి చిన్న గాయం అయిందని.. గత కొన్ని రోజులుగా ప్రభాస్ ను ఆ గాయం బాగా ఇబ్బంది పెడుతుందని.. ప్రభాస్ సర్జరీ వైపు మొగ్గు చూపాడని తెలుస్తోంది. ఈ సర్జరీ కోసం ప్రభాస్ యూఎస్ వెళ్ళనున్నాడట.
Also Read: బుల్లితెరపై సత్తాచాటిన వైష్ణవ్ తేజ్..!