https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ నుంచి సెన్సేషనల్ అప్‌డేట్..

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ పై హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది.. తారక్ గెటప్ ఎలా ఉండనుందని ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావుడి గురించి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ గెటప్ కు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ […]

Written By:
  • admin
  • , Updated On : July 14, 2020 / 09:43 PM IST
    Follow us on


    పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ పై హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది.. తారక్ గెటప్ ఎలా ఉండనుందని ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావుడి గురించి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ గెటప్ కు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం ఆరు గెటప్స్ లో కనిపిస్తాడని.. శత్రువులు గుర్తు పట్టకుండా ఉండటానికి భీమ్ తరుచూ తన వేషాన్ని మారుస్తూ ఉంటాడని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడా సినిమాలో ఆరు రకాలుగా ఉండబోతున్నాయని టాక్.

    ఎన్టీఆర్ ఒక్కడే పాన్ ఇండియా రేంజ్ ను..

    ఇక ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేస్తున్నాడట. రాజమౌళికి పర్సనల్ గా తారక్ పై అభిమానం ఉంది. అందుకే ఎన్టీఆర్ ను సినిమాలో హైలైట్ చెయ్యటానికే రాజమౌళి మొదటినుండి ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే తారక్ కోసం ప్రత్యేకంగా డైలాగ్స్ రాయించాడట. ఎన్టీఆర్ డైలాగ్ లన్నీ అద్భుతంగా ఉంటాయని.. మొత్తం సినిమాలోనే ప్రధాన హైలెట్స్ లో తారక్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయని.. తెలంగాణ యాసలో తారక్ పలికే మాడ్యులేషన్ చాలా గొప్పగా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రలోనే స్వతహాగా మంచి ఆవేశం ఉంటుంది.

    ఇక ఖర్చుకు ఏ మాత్రం భయపడకుండా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. కానీ కరోనా ప్రభావం ఈ సినిమా పై ఎక్కువ పడనుంది. ఇక ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ తో పాటు చాలా వరకూ నేపథ్య సంగీతాన్ని కూడా కీరవాణి పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై అన్ని ఇండస్ట్రీల నుండి అత్యంత భారీ అంచనాలు ఉండటంతో అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా విశ్వసనీయత తగ్గకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా శ్రీయా శరణ్ నటిస్తోందని ఆమె ఇటీవలే సోషల్ మీడియాలో ఘనంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే.