అదేంటి కేటిఆర్ గారూ.. మాట మార్చారు!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా కేసుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “కష్టకాలంలో దుష్ప్రచారం చేయొద్దని చెబుతూ… కరోనాతో రాజకీయం చేయడం సరికాదని, కరోనాకి ధనిక పేద అనే తేడాలు లేవని, ఎవరికైనా రావొచ్చన్నారు. తెలంగాణలో వేలల్లో కరోనా కేసులు వచ్చినా 98 శాతం మంది కోలుకున్నారని కేటిఆర్ తెలిపారు” అయితే ఇదంతా రెండు రోజుల క్రితం మాటలు. ఇప్పుడు ఆయన మాటలు మారిపోయాయి. ఇప్పుడు కరోనా పై కేటిఆర్ మాట్లాడుతూ.. “కరోనా విషయంలో సీఎం కేసీఆర్‌ […]

Written By: Neelambaram, Updated On : August 3, 2020 1:12 pm
Follow us on

తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా కేసుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “కష్టకాలంలో దుష్ప్రచారం చేయొద్దని చెబుతూ… కరోనాతో రాజకీయం చేయడం సరికాదని, కరోనాకి ధనిక పేద అనే తేడాలు లేవని, ఎవరికైనా రావొచ్చన్నారు. తెలంగాణలో వేలల్లో కరోనా కేసులు వచ్చినా 98 శాతం మంది కోలుకున్నారని కేటిఆర్ తెలిపారు” అయితే ఇదంతా రెండు రోజుల క్రితం మాటలు. ఇప్పుడు ఆయన మాటలు మారిపోయాయి.

ఇప్పుడు కరోనా పై కేటిఆర్ మాట్లాడుతూ..
“కరోనా విషయంలో సీఎం కేసీఆర్‌ విఫల మయ్యారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కొన్ని పత్రికలూ అదే రాస్తున్నాయి. మరి పాస్‌ అయిందెవరో, కరోనాను పూర్తిగా ఎవరు నిర్మూలించారో ప్రపంచంలో.., అలాగే దేశంలో ఒక్కరిని చూపించండి. ఎవరైనా నాయకుడు లేదా ఏదైనా ఒక ప్రభుత్వం గొప్పగా ఏ పనైనా చేసిందా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేత సాయం, మాట సాయం చేయాలే తప్ప విమర్శలు తగవు” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 98 శాతం కరోనా కేసులు తగ్గుతున్నాయని చెప్పిన కేటిఆర్, అంతలోనే మాటమార్చి దేశంలో ఏ రాష్ట్ర సీఎం కరోనాని కట్టడి చేశారో చెప్పామనడం హాస్యస్పందంగా ఉందని పలువురు ఆశ్చర్య పోతున్నారు. సీఎం కేసీఆర్ కూడా గతంలో కరోనా గూర్చి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపైన కరోనా అడ్డుపెట్టదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కరోనా తెలంగాణని ఏలుతుంటే.. కేటిఆర్ గాని, కేసీఆర్ గాని ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.