అదేవిధంగా హిందీలో కూడా బన్నీ సినిమాలు డబ్ అయి విపరీతంగా వ్యూస్ తెచ్చుకుని ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. మరి అలాంటి బన్నీ మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కాబట్టి.. ఆ సినిమా ఏ స్థాయిలో ఉండాలి ? అందుకే, పుష్ప విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్.
సహజంగా సుకుమార్ కు (Sukumar) ఒక అలవాటు ఉంది. తన కథలోని కథానాయకుడికి ఏదో బలమైన లోపం పెట్టడం, పైగా ఇది సుకుమార్ ప్రత్యేకత కూడా. ఈ క్రమంలోనే రంగస్థలంలో రామ్ చరణ్ కు వినికిడి లోపం పెట్టాడు. మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఏ లోపం పెట్టాడు ? అంటూ గత కొన్ని నెలలుగా దీన్ని తెలుసుకోవాలని ఆశ పడుతున్నారు అభిమానులు.
మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఉన్న లోపం ఏమిటంటే… బన్నీకి కుడి భుజం సరిగా పనిచేయదు. అందుకే దాక్కో దాక్కో మేక పాటలో కూడా బన్నీ చేత ఎడమ భుజంతోనే స్టెప్స్ వేయించారు. అన్నిటికీ మించి సుకుమార్ – బన్నీ కాంబినేషన్ అంటేనే ఆసక్తికరం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ఆర్య సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో కొత్తాగా చెప్పక్కర్లేదు.
ఇక ఆర్య 2 కూడా బన్నీని కొత్తగా ఆవిష్కరించింది. అందుకే, పుష్ప సినిమాకి ఇతర భాషల్లో కూడా భారీ బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగానే పుష్ప టీజర్ కి, పుష్ప ఫస్ట్ సాంగ్ కు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.