NTR And Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాలను అందుకుంటున్నాడు. అయినప్పటికి ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ దక్కించుకోకపోవడం గమనార్హం… అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోతున్న సినిమాతో పక్కాగా ఇండస్ట్రీ హిట్ కొడతానని భారీ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు…
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే దేవర(Devara) సినిమాతో సోలో హీరోగా పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సాధించి 500 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు. మరి ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయినప్పటికి 500 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో ఎన్టీఆర్ రేంజ్ తార స్థాయికి చేరిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో 2000 కోట్ల మార్కును టచ్ చేసి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలూస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూట్ ని స్టార్ట్ చేశారు. ఈనెల రెండో వారం నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేయాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఉన్నారట. సలార్ సినిమాను మించి ఇందులో ఫైటింగ్ సన్నివేశాలు ఉంటాయనే వార్తలైతే అందుతున్నాయి.
మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా భారీ రేంజ్ లో ఎలివేట్ అవుతుందా? జూనియర్ ఎన్టీఆర్ కి ఇంతకుముందు చేసిన సినిమాల కంటే మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెడుతుందా? ప్రశాంతి నీల్ ఈ సినిమాతో నెంబర్ వన్ దర్శకుడిగా మారతాడా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.
ఈ ఒక్క సినిమా అటు ప్రశాంత్ నీల్ కి, ఇటు ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ ను కట్టబెడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే సుకుమార్(Sukumar) లాంటి స్టార్ డైరెక్టర్ పుష్ప 2(Pushpa 2) సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు.
కాబట్టి ఆయన రికార్డును బ్రేక్ చేసి భారీ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తేనే ప్రశాంత్ నీల్ కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలైతే ఉంటాయి. లేకపోతే మాత్రం ఆయన కూడా చాలావరకు డీలాపడిపోయే అవకాశాలైతే ఉండనున్నాయి. ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ కు ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. మరి దాన్ని పదిలంగా కాపాడుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read:ఈ ముగ్గురు దర్శకులను నట్టేట ముంచేసిన పవన్ కళ్యాణ్…