Chanakya Niti: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రం గురించి కాకుండా మనుషుల జీవితాల గురించి ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేశాడు. వీటిలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి? పెళ్లయిన తర్వాత దంపతులు ఎలా ప్రవర్తించాలి? అన్యోన్య జీవితం కోసం ఎలాంటి సూచనలు పాటించాలి? అనే విషయాలను చాణుక్యుడు వివరించాడు. ఈ విషయాలను అర్థం చేసుకున్న చాలామంది తమ జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కానీ కొందరు పట్టించుకోకపోవడంతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే చాణక్యుడు చెప్పిన ప్రకారం కొన్ని విషయాలను భార్యకు అస్సలు చెప్పవద్దని తెలుపుతున్నాడు. ఈ విషయాలు భార్యకు చెప్పడం వల్ల మనశ్శాంతి లోపిస్తుందని చాణుక్య నీతి తెలుపుతుంది. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం..
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
ఉద్యోగం పురుష లక్షణం అంటారు. పురుషుడు గా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిని చేయాల్సి ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు. అయితే ఉద్యోగం లేదా వ్యాపారం చేసే క్రమంలో నిరంతరం వచ్చే ఆదాయం కంటే ఒక్కోసారి అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఇలా అదనపు ఆదాయం గురించి భార్యకు చెప్పడం వల్ల వేరేలా అర్థం చేసుకుంటుంది. అంటే మరో సమయంలో కూడా అదనపు ఆదాయం ఎందుకు రావడం లేదని ప్రశ్న తలెత్తుతుంది. అందువల్ల అదనపు ఆదాయం గురించి భార్యకు చెప్పకపోవడమే మంచిది. ఇలా చెప్పడం వల్ల భార్య తన భర్త ఎక్కువగా సంపాదిస్తున్నాడనే బావలో మునిగిపోయి ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది.
ఉద్యోగం లేదా వ్యాపారం చేసే క్రమంలో ప్రశంసలే కాకుండా అవమానాలు కూడా ఎదుర్కొనే సందర్భాలు ఉంటాయి. అయితే ఈ అవమానాలు ఎదుర్కొన్న విషయాన్ని భార్యతో చెప్పడం వల్ల కొన్ని సందర్భాల్లో వీటి విషయాలను బయటపెడుతూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనసు ఆందోళనగా మారుతుంది. అందువల్ల ఈ విషయాలను బయట పెట్టకపోవడమే మంచిది అని చాణుక్యనీతి తెలుపుతుంది. అయితే తాను పనిచేసే స్థలంలో ప్రశంసలు వస్తే మాత్రం చెప్పుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇలా చెప్పడం వల్ల తన భార్య నుంచి ప్రశంసలు రావడంతో తాను కూడా సంతోషంగా ఉండగలుగుతారని అంటున్నారు.
పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు
అనే సామెత ఉంటుంది. దీనిని బాగా గ్రహించిన వారు కొందరు దానం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఏ ఇల్లాలు అయినా తన భర్త సొమ్ము పరులకు పంచి పెడుతూ ఉంటే ఒప్పుకోదు. అయితే భర్తకు మాత్రం దానం చేయాలని ఆశ ఉంటుంది. తాను దానం చేయాలని అనుకున్నప్పుడు భార్యకు చెప్పకుండా చేయడమే మంచిది. అలా చెప్పడం వల్ల ఎప్పుడో ఓసారి సూటి పోటీ మాటలతో నిందిస్తూ ఉంటుంది. అందువల్ల దానం చేసే విషయాన్నీ భార్యతో చెప్పకపోవడమే చాలా మేలు అని చాణిక్య నీతి తెలుపుతుంది.
ప్రతి మనిషిలో బలాలు ఎన్ని ఉంటాయో బలహీన తలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఇలాంటి బలహీనతల గురించి ఎదుటివారితో పాటు భార్యకు కూడా చెప్పకపోవడమే మంచిది. ఈ విషయాలు చెప్పడం వల్ల కొన్ని సందర్భాల్లో వాటిని ఆధారంగా చేసుకొని అవహేళన చేస్తూ ఉంటారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోతూ ఉంటాయి.
Also Read: ఈ ముగ్గురు దర్శకులను నట్టేట ముంచేసిన పవన్ కళ్యాణ్…