Chaitu And Shobitha: శోభిత ధూళిపాళ్ల భార్యగా వచ్చాక విడుదలైన మొదటి చిత్రం తండేల్ హిట్ అయ్యింది. నాగ చైతన్య నటించిన గత రెండు చిత్రాలు థాంక్యూ, కస్టడీ డిజాస్టర్స్ అయ్యాయి. మంచి మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని నాగ చైతన్య భావించాడు. తన మిత్రుడు చందూ మొండేటి తో నాగ చైతన్య చేతులు కలిపాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన తండేల్ మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటించింది.
తండేల్ విజయాన్ని భార్య శోభిత ధూళిపాళ్ల కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు నాగ చైతన్య. విరామం రావడంతో ఇష్టమైన ప్రదేశానికి చెక్కేశారు. వీరి లేటెస్ట్ టూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శోభిత, నాగ చైతన్య రేసు కారులను నడిపారు. రేస్ ట్రాక్ పై దూసుకెళుతున్న తమ సాహసాలను కెమెరాలలో బంధించారు. ఆ ఫోటోలను శోభిత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సమంతతో విడాకులు అయ్యాక నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళకు దగ్గరయ్యాడని సమాచారం. అంతకు ముందే శోభితతో పరిచయం ఉందో లేదో స్పష్టత లేదు. శోభిత-నాగ చైతన్యల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. శోభిత ఓ సందర్భంలో వాటిని కొట్టిపారేసింది. విదేశాల్లో విహరిస్తున్న వీరి ఫోటోలు బయటకు రావడం చర్చనీయాంశమైంది. 2024 ఆగస్టులో సడన్ గా నిశ్చితార్థం జరుపుకుని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు పాల్గొనగా.. అత్యంత నిరాడంబరంగా ఎంగేజ్మెంట్ వేడుక ముగిసింది. ఈ ఫోటోలు నాగార్జున ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేశాడు. శోభితకు అక్కినేని ఫ్యామిలీలోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు.
డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వివాహం జరిగింది. పెళ్లి కూడా కేవలం 300 మంది అతిథులను ఆహ్వానించారు. సింపుల్ గా ముగించారు. శోభిత, నాగ చైతన్య కోరిక మేరకు హడావుడి లేకుండా పెళ్లి తంతు ముగించినట్లు నాగార్జున తెలిపారు. శోభిత తెలుగు అమ్మాయే కాగా… ముంబైలో కెరీర్ మొదలుపెట్టింది. హిందీ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలు చేసింది. వివాహం అనంతరం శోభిత చిత్రాలు చేస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.