Akhil Lenin Movie: అక్కినేని ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ప్రతి ఒక్క హీరో వాళ్ళ స్టామినా ను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు నాగేశ్వరరావు రొమాంటిక్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన తర్వాత నాగార్జున సైతం కెరియర్ మొదట్లో లవ్ స్టోరీలను సినిమాలుగా ఎంచుకున్నప్పటికి ఆ తర్వాత వరుసగా డిఫరెంట్ జనార్స్ లో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని చేస్తున్నాడు. ఇక అతనితో పాటుగా తన కుమారులు అయిన నాగచైతన్య, అఖిల్ సైతం హీరోలుగా పరిచయమయ్యారు. ఇక అఖిల్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి టెన్ ఇయర్స్ అయిపోయింది. అయినప్పటికి అఖిల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…కారణం ఏదైనా కూడా ఆయన చేసిన సినిమాలన్నీ ఆశించిన మేరకు విజయాలనైతే సాధించలేకపోతున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో ఇప్పుడు లెనిన్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ఆయన ఎలాంటి నటనను కనబరుస్తాడు. తద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ సినిమా కనక ప్లాప్ అయినట్లయితే మాత్రం అఖిల్ తన సినిమా క్లియర్ ని పూర్తిగా కోల్పోవాల్సిన ప్రమాదం కూడా ఉందని పలువురు సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు.
Also Read: ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో కోర్టుకు ఏపీ ప్రభుత్వం!
ఇప్పటికి నాగార్జున అఖిల్ కి ఒక కండిషన్ పెట్టారట. ఈ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నట్లయితే ఆయన బిజినెస్ చూసుకోవాలని చెప్పారట… దానికి అఖిల్ కూడా ఎస్ చెప్పినట్టుగా తెలుస్తోంది… ఎందుకంటే ఇప్పటి వరకు నాగార్జున అఖిల్ తో చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాడు. అటు సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. తన కెరీర్ ని చాలా వరకు వేస్ట్ చేసుకుంటున్నాడు.
ఇలాంటి సమయంలో తమకున్న బిజినెసులు చూసుకుంటే కనీసం అవైనా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయన కూడా ఒక మంచి కొత్త లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తన కంటే వెనక వచ్చిన హీరోలు సైతం సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే అఖిల్ మాత్రం సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు అనే వెలితి అతనికి ఇంకా ఉంది.
కాబట్టి తను కొంతవరకు డిప్రెషన్ లో ఉన్నాడు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం తను పూర్తిస్థాయి డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తనను బిజినెస్ మూడ్ లోకి షిఫ్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంలో నాగార్జున ఉన్నట్లుగా తెలుస్తోంది…