Samantha Dhulipala: సమంత-నాగ చైతన్య టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. వీరు విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కారణం తెలియదు కానీ సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. 2021 అక్టోబర్ నెలలో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు తెలియజేశారు. విడాకులు అనంతరం నాగ చైతన్య పూర్తిగా సైలెంట్ అయ్యాడు. సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా తన వేదన వెళ్లగక్కేది. కొన్ని ఇంటర్వ్యూలలో నాగ చైతన్య మీద ఆమె పరుష కామెంట్స్ కూడా చేశారు.
నాగ చైతన్య-సమంత తమ టీమ్స్ తో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేయించారనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం ఎవరి కెరీర్లో వారు బిజీ. గత రెండేళ్లుగా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్న నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో వీరికి వివాహం. శోభిత-నాగ చైతన్య నిశ్చితార్థం నేపథ్యంలో సమంత పేరు మరలా తెరపైకి వచ్చింది. సమంత, నాగ చైతన్య ఎందుకు విడిపోయారు? కారణాలు ఏమిటీ? అంటూ కథనాలు వెలువడ్డాయి.
సమంత ఏవిధంగానూ నాగ చైతన్య రెండో వివాహం మీద స్పందించలేదు. అయితే శోభితతో వివాహం ద్వారా నాగ చైతన్య జీవితంలోకి మరో సమంత వస్తుంది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. విషయంలోకి వెళితే… శోభిత ధూళిపాళ్ల తెలుగు అమ్మాయి కాగా… వీరిది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి. శోభిత ధూళిపాళ్లకు ఒక చెల్లి ఉంది. ఆమె పేరు సమంత ధూళిపాళ్ల. నాగ చైతన్య మాజీ భార్య పేరు కాబోయే మరదలు పేరు ఒక్కటే కావడం విశేషం.
మాజీ భార్యగా ఒక సమంత నాగ చైతన్య జీవితం నుండి వెళ్ళిపోయింది. మరదలు రూపంలో మరొక సమంత వచ్చింది. మీడియాలో దీనిపై కథనాలు రావడం కొసమెరుపు. ఇక సమంత ధూళిపాళ్ల హై ప్రొఫైల్ కలిగి ఉంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్. ఎండీ ఎఫ్ఆర్సీఎస్, రేడియో డయాగ్నసిస్ చేసింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా నుండి మెటర్నల్-ఫీటల్ మెడిసిన్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కన్సల్టెంట్ గా పని చేస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సమంత ధూళిపాళ్ల ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ని 17 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. అమ్మడు హీరోయిన్స్ కి మించి గ్లామర్ షో చేస్తుంది. వందల కోట్లు లేకుండా విద్యావంతుల ఫ్యామిలీ. అందుకే నాగార్జున ఈ సంబంధానికి ఒప్పుకుని ఉంటాడు. శోభిత-నాగ చైతన్యల నిశ్చితార్థం నేపథ్యంలో సమంత ధూళిపాళ్ల ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జనాలు.
ఆగస్టు 8న నాగ చైతన్య-శోభితలకు నిశ్చితార్థం జరిగింది. వివాహానికి మాత్రం సమయం ఉందని నాగార్జున తెలియజేశారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. తండేల్ మూవీలో నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్నాడు. ఇక శోభిత సితార టైటిల్ తో ఒక చిత్రం చిత్రంలో నటిస్తుంది.