History of ODI Cricket : వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్లు వీరే..

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. పరుగులపరంగా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 11, 2024 1:25 pm
Follow us on

History of ODI Cricket : క్రికెట్ కు, భారత్ కు విడదీయరని సంబంధం ఉంటుంది. క్రికెట్ లో మన దేశానికి చెందిన ఆటగాళ్లు అనితర సాధ్యమైన రికార్డులను నెలకొల్పారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాల్లో కొనసాగుతున్నారు.. టీమిండియా ఇప్పటివరకు రెండుసార్లు వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సాధించింది.

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. పరుగులపరంగా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరియర్లో 452 ఇన్నింగ్స్ లు ఆడాడు. 18,426 పరుగులు చేశాడు. ఇందులో అతని హైయెస్ట్ స్కోర్ 200*. 44.83 సగటుతో 49 సెంచరీలు చేశాడు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ మొత్తం 282 ఇన్నింగ్స్ లు ఆడాడు. 13,886 రన్స్ చేశాడు. ఇందులో అతని హైయెస్ట్ స్కోర్ 183. 58.34 సగటుతో 50 సెంచరీలు చేశాడు.

సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ 297 ఇన్నింగ్స్ లు ఆడాడు. 11,221 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 183. 40.95 సగటుతో వన్డేలలో 22 సెంచరీలు చేశాడు.

రోహిత్ శర్మ

రోహిత్ 256 ఇన్నింగ్స్ లు ఆడాడు. 10,831 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 264 రన్స్. బ్యాటింగ్ సగటు 49.23. ఇప్పటివరకు 31 సెంచరీలు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (330) కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. వన్డేలలో 264 రన్స్ చేయడం ద్వారా.. అతడి బ్యాటింగ్ పరాక్రమం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రాహుల్ ద్రావిడ్

రాహుల్ ద్రావిడ్ 314 ఇన్నింగ్స్ ఆడాడు..10,768 రన్స్ చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 153. 39.15 బ్యాటింగ్ సగటుతో 12 సెంచరీలు చేశాడు.

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని 294 ఇన్నింగ్స్ లు ఆడాడు. 10,599 రన్స్ చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 183*. 50.23 సగటుతో 9 సెంచరీలు చేశాడు.

మహమ్మద్ అజారుద్దీన్

అజారుద్దీన్ 308 ఇన్నింగ్స్ లు ఆడాడు. 9,378 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 153*. 36.92 బ్యాటింగ్ సగటుతో ఏడు సెంచరీలు చేశాడు.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ 275 ఇన్నింగ్స్ లు ఆడాడు. 8,609 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 150. 36.47 బ్యాటింగ్ సగటుతో 14 సెంచరీలు చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్ 235 ఇన్నింగ్స్ లు ఆడాడు. 7,995 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 219. 35.37 బ్యాటింగ్ సగటుతో 15 సెంచరీలు చేశాడు.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ 164 ఇన్నింగ్స్ లు ఆడాడు. 6,793 రన్స్ చేశాడు. ఇతడు హైయెస్ట్ స్కోర్ 143. 44.11 బ్యాటింగ్ సగటుతో 17 సెంచరీలు చేశాడు.

 

https://timesofindia.indiatimes.com/sports/cricket/web-stories/top-indian-run-scorers-in-mens-odi-history/photostory/112287064.cms