https://oktelugu.com/

Dasara Movie: మరో హీరో ఫ్రెండ్షిప్ కోసం వెతుకుతున్న నేచురల్ స్టార్ నాని…

Dasara Movie: పక్కింటి అబ్బాయిలా నాచురల్ స్టార్ నాని విభిన్నమైన పాత్రలో కనిపిస్తూ అందర్నీ అలరిస్తూ ఉంటారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా తన సినిమాలను ఓటిటి వేదికగా విడుదల చేస్తూ వార్తల్లో కూడా నిలిచారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాని. ఒక వైపు శ్యామ్ సింగరాయ్ సినిమాని కంప్లీట్ చేసిన నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో… అలానే ‘దసరా’ అనే మరో సినిమాలో నటిస్తున్నారు నాని. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 05:42 PM IST
    Follow us on

    Dasara Movie: పక్కింటి అబ్బాయిలా నాచురల్ స్టార్ నాని విభిన్నమైన పాత్రలో కనిపిస్తూ అందర్నీ అలరిస్తూ ఉంటారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా తన సినిమాలను ఓటిటి వేదికగా విడుదల చేస్తూ వార్తల్లో కూడా నిలిచారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాని. ఒక వైపు శ్యామ్ సింగరాయ్ సినిమాని కంప్లీట్ చేసిన నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో… అలానే ‘దసరా’ అనే మరో సినిమాలో నటిస్తున్నారు నాని.

    అయితే రీసెంట్ గా దసరా సినిమాకి సంబంధించిన మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పోస్టర్ లో నాని రగ్డ్ లుక్ లో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం నాని తెలంగాణ యాస కూడా నేర్చుకుంటున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో రూపొందనున్నట్లు అనుకుంటున్నారు. ఈ  చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా  నటిస్తున్నారు.

    అయితే ఈ సినిమాలో హీరోతో పాటు అతడి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. ఆ పాత్ర సినిమాకు చాలా కీలకమని ఆ పాత్రలో మరో యంగ్ హీరోని తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఇప్పటికే ఇద్దరు హీరోలను సంప్రదించారట మేకర్స్. చూడాలి మరి నానితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ హీరో ముందుకొస్తారో అనేది. డిసెంబర్ 24 న “శ్యామ్ సింగరాయ్”తో  అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు నాని.