https://oktelugu.com/

Tollywood: ఒకే చోట సమంత – నాగ చైతన్య… ఆ తర్వాత ఏం జరిగిందంటే

Tollywood: నాగ చైతన్య – సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమతో మొదలైన వీరి పరిచయం వివాహ బంధంతో ఒక్కటై టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ నిలిచారు. ఈ జంట ఏ షో కి వచ్చిన అభిమానుల కన్నుల పండుగ ఉండదనే చెప్పాలి. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఈ జంట వివాహబంధానికి స్వస్తి చెప్పారు. వీరిద్దరూ విడిపోవడం చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 26, 2021 / 03:58 PM IST
    Follow us on

    Tollywood: నాగ చైతన్య – సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమతో మొదలైన వీరి పరిచయం వివాహ బంధంతో ఒక్కటై టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ నిలిచారు. ఈ జంట ఏ షో కి వచ్చిన అభిమానుల కన్నుల పండుగ ఉండదనే చెప్పాలి. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఈ జంట వివాహబంధానికి స్వస్తి చెప్పారు. వీరిద్దరూ విడిపోవడం చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. యూట్యూబ్ లో కూడా సమంతపై తప్పుడు వీడియోలు ప్రసారం చేయగా దీనిపై సమంత ఫైర్ అయింది.

    కాగా నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట విడాకులు తీసుకొని మూడు నెలలకు కావస్తున్నా ఇప్పటికీ వీరి అంశం వైరల్‌గా మారుతూనే ఉంది. అసలు తమ విడాకులకు కారణమేంటన్న విషయాన్ని ఈ జంట ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరూ ప్రస్తుతం తమ, తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ జంట విడాకుల తర్వాత కలిసి ఇంత వరకు కనిపించలేదనే చెప్పాలి. అయితే తాజాగా సమంత, నాగచైతన్యలు ఇద్దరు ఒకేచోట అనుకోకుండా ఉండాల్సి వచ్చింది. కానీ అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నిరాశ పడడం గ్యారంటీ అని చెప్పొచ్చు.

    నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు సినిమా షూటింట్‌లో బిజీగా ఉండగా, సమంత యశోద సినిమా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు చిత్రాల షూటింగ్‌ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దీంతో అనుకోని పరిస్థితుల్లో చై, సామ్‌ ఒకే చోట ఉండాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ ఒకేచోట ఉన్నా కనీసం ఒకరిని ఒకరు చూసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయం ముందు గానే తెలిసిన జంట ఒకరికి ఒకరు తారస పడకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. చై, సామ్‌ ఇద్దరూ తమ షూటింగ్‌ను పూర్తి చేసుకొని ఒకరికొరు కనబడకుండానే బయటకు వెళ్లిపోయారని తెలుస్తుంది.