https://oktelugu.com/

Actor Vishal: విశాల్ “సామాన్యుడు” మూవీ టీజర్ రిలీజ్…

Actor Vishal: త‌మిళ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తనదైన నటనతో తమిళ్లోనే కాకుండా తెలుగు లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విశాల్‌. ప్రస్తుతం విశాల్ హీరోగా తెర‌కెక్కుతున్న 31 వ సినిమా సామాన్యుడు. నాట్ ఏ కామ‌న్ మ్యాన్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌. ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ద్వారా తుపా శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాలో డింపుల్‌ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 26, 2021 / 04:15 PM IST
    Follow us on

    Actor Vishal: త‌మిళ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తనదైన నటనతో తమిళ్లోనే కాకుండా తెలుగు లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విశాల్‌. ప్రస్తుతం విశాల్ హీరోగా తెర‌కెక్కుతున్న 31 వ సినిమా సామాన్యుడు. నాట్ ఏ కామ‌న్ మ్యాన్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌. ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ద్వారా తుపా శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాలో డింపుల్‌ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

    తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు. ఇంకొకరు ఆ సామాన్యులను డబ్బు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు… ఆ రాక్షసుల తలరాతను మార్చి రాయాల్సిన పరిస్థితి ఒకరోజు ఒక సామాన్యుడికి వస్తుంది అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

    ఇక ఈ మేరకు టీజర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. 2022 జనవరి 26న ‘సామాన్యుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.