https://oktelugu.com/

2021 Roundup: తెలుగు చిత్రపరిశ్రమ హైలెట్స్

2021 Roundup: తెలుగు చిత్ర పరిశ్రమలో 2021 సంవత్సరం మంచితో పాటు చేదు గుర్తులను కూడా మిలిగ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పవన్ కళ్యాణ్ కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అభిమానులకు కోరిక మేరకు ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ‘వఖీల్ సాబ్’ మూవీతో భారీ హిట్ కొట్టారు. దీంతో అభిమానులు పండగ చేసుకున్నారు మెగా ఫ్యామిలీలో విషాదం : ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి విషాదం తీసుకొచ్చింది. హీరో సాయి ధరమ్ తేజ్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 26, 2021 / 03:36 PM IST
    Follow us on

    2021 Roundup: తెలుగు చిత్ర పరిశ్రమలో 2021 సంవత్సరం మంచితో పాటు చేదు గుర్తులను కూడా మిలిగ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పవన్ కళ్యాణ్ కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అభిమానులకు కోరిక మేరకు ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ‘వఖీల్ సాబ్’ మూవీతో భారీ హిట్ కొట్టారు. దీంతో అభిమానులు పండగ చేసుకున్నారు

    2021 Roundup

    మెగా ఫ్యామిలీలో విషాదం :

    ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి విషాదం తీసుకొచ్చింది. హీరో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆయన కోసం మెగా ఫ్యామిలీ ఎంతో భయాందోళనకు గురైంది. తేజ్ ఆరోగ్యంగా ఉండాలని ఎంతో మంది అభిమానులు ప్రార్థనలు చేయగా ఆయన క్షేమంగా బయటపడ్డారు.

    సామ్ చై విడాకులు :

    2021 సంవత్సరం అక్కినేని కుటుంబంలో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నారు. దీనికి గల కారణం తెలియదు. నాలుగేళ్ల పెళ్లి బంధాన్ని ఒక్క డెసిషన్‌తో బ్రేక‌ప్ చెప్పారు. విడాకుల విషయం సామ్ చై పర్సనల్. కానీ సోషల్ మీడియాలో సమంతను చాలా మంది విమర్శిస్తున్నారు.

    పవన్ రిపబ్లిక్’ ప్రసంగం :

    పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా చేసిన ప్రసంగం హైలెట్ అయ్యింది. సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆన్ లైన్ టికెటింగ్ అంశంపై చేసిన కామెంట్స్ కూడా వైసీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది.

    పోసానికి పవన్ ఫ్యాన్స్ షాక్ :

    ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ నటుడు పోసాని కృష్ణమురళి కామెంట్స్ చేశారు. పవన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన హద్దు మీరి పవన్ పై కామెంట్స్ చేయడంతో పవన్ అభిమానులు రెచ్చిపోయారు. ఆయన ఇంటిపై రాళ్లదాడి జరిగింది. దీంతో నాటి నుంచి పోసాని కనిపించడం లేదు.

    ‘మా’ పంచాయితీ : 2021లో టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గది ఏమైనా ఉందంటే అది మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు. మా అధ్యక్షుడిగా విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయింది. అయితే, ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పారదర్శకంగా ఎన్నికలు జరగలేదంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మా పదవులకు రాజీనామా చేశారు. కొంతకాలం ఎదురుచూసి విష్ణు వారి రాజీనామాలను ఆమోదించారు.

    Also Read: నిర్మాతలు చెప్పేది వినడు, హీరో చెప్పేది విన్నట్టు నటిస్తాడు.

    సిరివెన్నెల మరణం: తెలుగు చిత్రపరిశ్రమ పాటల పూదోటను కోల్పోయింది. సిరివెన్నెల అస్తమించారు. ఆయన మరణాన్ని టాలీవుడ్ జీర్ణించుకోలేకపోయింది. దేశ వ్యాప్తంగా ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

    హీరో నాని కామెంట్స్: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయంపై నేచురల్ స్థార్ నాని స్పందంచారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రేక్షకులను అవమానిందని, సమోస షాపు వాడికి వచ్చిన డబ్బులు కూడా థియేటర్ యాజమానులకు రావని కామెంట్ చేశారు. దీంతో మరోసారి వైసీపీ నేతలు హీరోనానిని టార్గెట్ చేశారు. మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాదిని ఇలా ముగించింది.

    Also Read: “బలం” గా రానున్న తమిళ స్టార్ హీరో అజిత్…

    Tags