Venkatesh And Soundarya: ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో విక్టరీ వెంకటేష్ సూపర్ సక్సెస్ అయ్యాడు. శోభన్ బాబు లాంటి నటుడు తను చేసిన సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులందరిని మెప్పించి తనువైపు తిప్పుకున్నాడు. ఇక ఆయన తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో వెంకటేష్ కావడం విశేషం…తమిళంలో భాగ్యరాజా చేసిన ప్రతి సినిమాని తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ సూపర్ సక్సెస్ ని సాధించాడు. అలాంటి వెంకటేష్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుందని సగటు ప్రేక్షకులు నమ్మేవారు.
అందువల్లే అతని సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించేవారు. ఇక దర్శక నిర్మాతలు సైతం వెంకటేష్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటి సినిమా అనే ఉద్దేశ్యంలో ఉండేవారు. కాబట్టి అతనితో సినిమాలు చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. వెంకటేష్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు. ఇక వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యేది.
దాంతో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహ పూర్వకమైన సంబంధమైతే ఏర్పడింది. దాంతో చాలామంది వెంకటేష్ సౌందర్యని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వాళ్ళిద్దరి మధ్య చాలా కథనాలైతే వెలువడ్డాయి. ఇక ఈ విషయం మీద అటు వెంకటేష్, ఇటు సౌందర్య ఎలాంటి వివరణ ఇచ్చేవారు కాదు…వాళ్ల సినిమాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకుసాగారు. ఇక ఇదే సమయంలో వీళ్ళ మీద వచ్చిన గాసిప్స్ రామానాయుడు గారి దగ్గరికి చేరడంతో దాంతో ఆయన ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.
కాబట్టి అతని మీద ఇలాంటి రూమర్స్ వస్తే అతని కెరియర్ కి ఇబ్బంది అవ్వచ్చు అనే ఉద్దేశ్యంతో ఏదో ఒక రకంగా చెప్పాలని వెంకటేష్ సౌందర్య మధ్య ఉన్న బాండింగ్ కేవలం స్నేహపూరితమైన సంబంధం అని వాళ్ళ మధ్య ఎలాంటి ఎఫైర్స్ లేవని ప్రూవ్ చేయాలనుకున్నాడు. అందుకే సౌందర్య వెంకటేష్ కలిసి చేస్తున్న ఒక సినిమా సెట్ లోనే సౌందర్య తో వెంకటేష్ కి రాఖీ కట్టించారట. దాంతో అప్పటినుంచి ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగారు…