Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి టాప్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. కాబట్టి వాళ్లకి అభిమానులుగా మారిపోతారు. స్క్రీన్ మీద హీరో కనిపించిన ప్రతిసారి సగటు ప్రేక్షకుడు తనలో తనని చూసుకొని తను చేయలేనివి హీరో చేస్తున్నాడు అంటూ మురిసిపోతాడు. దానివల్ల హీరో ఎక్కడైనా తగ్గితే అసలు ఊరుకోడు… ఇక సినిమాలను తీసే ప్రొడ్యూసర్లు మాత్రం ఒక సినిమా మీద భారీగా డబ్బులను ఖర్చు పెడుతుంటారు. సినిమా సక్సెస్ అయితే ప్రాబ్లం లేదు. కానీ ప్లాప్ అయి నష్టం వస్తే మాత్రం తన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. అందుకే హీరోలకు డేట్స్ ని తీసుకోవడంలో గాని ఒక కథను ఫైనల్ చేసి సినిమాగా తెరకెక్కించడంలో గాని చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది…
ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న విజయశాంతి పర్సనల్ మేకప్ మ్యాన్ గా పని చేసిన ఏ ఏం రత్నం…ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన ఖుషి సినిమాతో టాప్ ప్రొడ్యూసర్ గా పేరైతే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో మరికొన్ని సినిమాలు కూడా చేశాడు. ఇక ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు తన కొడుకులు చేసిన కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.
దానివల్ల అతను భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన పెద్ద కొడుకు అయిన జ్యోతి కృష్ణ దర్శకుడిగా మారి చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దానివల్ల ఆయన నష్టాలను చవిచూశాడు. తన చిన్న కొడుకు అయిన రవికృష్ణ ను హీరోగా నిలబెట్టడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. అది కూడా వర్కౌట్ కాలేదు దాంతో కొద్దిరోజుల పాటు సినిమాలను ప్రొడ్యూస్ చేయకుండా ఖాళీగా ఉన్నాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాను చేసి మరోసారి ప్రొడ్యూసర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే హరిహర వీరమల్లు సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేశాయి. ఏ ఏం రత్నం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడనికి పవన్ కళ్యాణ్ కారణం అంటూ ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు…