Bro Movie: బ్రో మూవీలో పవన్ చేతికున్న లేబర్ లైసెన్స్ బిళ్లకు ఇంత కథ ఉందా?

తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఈ లుక్ ట్రై చేశారు. 'వయ్యారి భామ నీ హంస నడక' పాటలో అందమైన అమ్మాయి వెనుక పడే కూలీగా అలరించారు.

Written By: Shiva, Updated On : July 28, 2023 2:13 pm

Bro Movie

Follow us on

Bro Movie: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, గెటప్స్ హైలెట్ గా నిలిచాయి. భగవంతుడిగా పవన్ కళ్యాణ్ భిన్నమైన గెటప్స్ ట్రై చేశారు. వాటిలో కూలీ గెటప్ అమితంగా ఆకర్షించింది. ఎర్ర చొక్కా, లుంగీ కట్టులో బీడీ కాల్చుతూ ఊర మాస్ అవతార్ లో పవన్ మెస్మరైజ్ చేశారు.

ఈ గెటప్ అంతగా ఆకట్టుకోవడానికి మరొక కారణం ఉంది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఈ లుక్ ట్రై చేశారు. ‘వయ్యారి భామ నీ హంస నడక’ పాటలో అందమైన అమ్మాయి వెనుక పడే కూలీగా అలరించారు. అప్పట్లో ఈ లుక్ యువతను బాగా ఆకర్షించింది. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ పాత చిత్రాల రిఫరెన్స్ లు కొన్ని ట్రై చేశారు. వాటిలో ఈ కూలీ గెటప్ ఒకటి. కాగా ఈ గెటప్ లో పవన్ చేతికి లేబర్ లైసెన్సు బిళ్ళ మనం చూడొచ్చు.

దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. జనసేన పార్టీ జెండాలో మనం ఒక స్టార్ చూడొచ్చు. ఆ సింబలే పవన్ కళ్యాణ్ లైసెన్సు బిళ్ళ మీద ముద్రించారు. ఇది ఏపీలో గల తెనాలి పట్టణంలో తయారైంది. గోల్డ్ వర్కర్స్ సోమరౌతు బ్రహ్మం, అనురాధ తయారు చేశారు. వీరికి తెనాలిలో సిల్వర్ అండ్ గోల్డ్ షాప్ ఉంది. అందులో జనసేన గుర్తు వచ్చేలా లైసెన్సు బిళ్ళ తయారు చేశారు. దాన్నే పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో ఉపయోగించారు.

ఈ విషయం తెలిశాక ఆ లైసెన్సు బిళ్ళను జనాలు ప్రత్యేకంగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో స్వర్ణకారులైన సోమరౌతు బ్రహ్మం, అనురాధలకు మంచి ప్రచారం కల్పించారు. ఇక భీమ్లా నాయక్ సినిమాతో మొగిలయ్య అనే జానపద కళాకారుడిని వెలుగులోకి తెచ్చారు. అతడు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. మొగిలయ్యతో ఒక పాట పాడించడం జరిగింది.