D51: తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ తెలుగులో నటించాలని ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు తెలుగులో అవకాశాలు రాకపోతే కోలీవుడ్ వైపు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అక్కడి హీరోలు తెలుగులో నటించాలని ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమిళ హీరోలు నాటి రజనీకాంత్, కమలాసన్ నుంచి నేటి సూర్య, శివకార్తకేయన్ వరకు నటించారు. ఇప్పుడు లేటేస్టుగా మరో స్టార్ హీరో నేరుగా తెలుగులో నటించడానికి రెడీ అయ్యాడు. ఆయనే ధనుష్..
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బిగ్ అనౌన్స్ చేశాడు. ఇన్నాళ్లు కొత్తవాళ్లతోనే సినిమాలు తీస్తాడనే సాంప్రదాయాన్ని ఈసారి మార్చబోతున్నాడు. తాను తీయబోయే నెక్ట్్ మూవీ గురించి బహిరంగం చేశాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ మూవీకి ‘డీ 51’ అనే వర్కింగ్ డైటిల్ ను డిసైడ్ చేశారు. నారాయణ దాస్ కె. నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ జయంతి సందర్భంగా ఈ మూ గురించి చెప్పారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు మీరు ధనుష్ ను ఈ సినిమాలో చూస్తారని చెప్పారు. శేఖర్ కమ్ముల డిఫరెంట్ కథను సిద్ధం చేశారని, కొత్త కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనేది చెప్పలేదు. శేఖర్ కమ్ముల లాస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ తీశాడు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవిలు నటించారు. ఇక డీ 51 హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది.
అటు ధనుష్ తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగులోనే ధనుష్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తీసిన ప్రతీ సినిమా తెలుగులో డబ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు నేరుగా ఏ సినిమా చేయలేదు. కానీ శేఖర్ కమ్ముల తీయబోయే ధనుష్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారుతోంది. శేఖర్ కమ్ముల అనగానే యూత్ ఫుల్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ ఉంటుంది. మరి ధనుష్ తో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.