Bro Collections: బ్రో 11వ రోజు కలెక్షన్స్… ఇంకా పవన్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే!

బ్రో సినిమా పదో రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు కోటి రూపాయలు సాధించింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా పదో రోజు కూడా ఈ స్థాయి వసూళ్లు అంటే గొప్పే అని చెప్పాలి.

Written By: Shiva, Updated On : August 8, 2023 9:28 am

Bro Collections

Follow us on

Bro Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన డివోషనల్ కాన్సెప్టు సినిమా బ్రో. విడుదలై దాదాపు 12 రోజులు అవుతున్న కానీ అక్కడక్కడ మంచి వసూళ్లు సాధిస్తుంది. కానీ అవి పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టుగా లేదని మాటలు వినిపిస్తున్నాయి. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం వినోదయ సీతమ్ అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మించింది.

పవన్ కళ్యాణ్ కు కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను భారీ రేట్లు కు అమ్మేశారు. ఒక్క నైజం లో 30 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి దాదాపు 50 కోట్లు, రెస్టాఫ్ తెలుగు స్టేట్స్ 5 నుంచి 6 కోట్లు ఓవర్శిస్ 12 కోట్లు లెక్కన దాదాపు 97 కోట్లకు ఈ సినిమా అమ్మకాలు జరిగాయి. దీంతో బ్రో సినిమా 97 కోట్లు వసూళ్లు సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేయలేదు. కానీ సినిమాకు వస్తున్నా వసూళ్లను గమనిస్తే ఆ మార్క్ ను టచ్ చేయడం కష్టమే అని అనిపిస్తుంది.

బ్రో సినిమా పదో రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు కోటి రూపాయలు సాధించింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా పదో రోజు కూడా ఈ స్థాయి వసూళ్లు అంటే గొప్పే అని చెప్పాలి. కానీ 11 వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం 45 లక్షలు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో కలిపి కేవలం 60 లక్షలు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 70 కోట్లు దాకా వసూళ్లు సాధించిన బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమే అని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకో మొదటి నుండి ఈ సినిమా మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. తమ హీరో ఇలాంటి పాత్రలో నటించడం ఇష్టం లేదు కాబోలు. దాని ఎఫెక్ట్ మొదటి వీక్ కలెక్షన్స్ మీద సృష్టంగా కనిపించింది. ఆ తర్వాత సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్న వసూళ్లు సాధించలేదు. అయితే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో ఈ మాత్రం వసూళ్లు అయినా వచ్చాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన తర్వాత సినిమా లైనా ఉస్తాద్, OG సినిమాల మీద ఫోకస్ పెట్టారు.