Crime News : అది హనుమకొండ జిల్లా.. అతని పేరు ప్రశాంత్. చూడ్డానికి బాగుంటాడు. అమాయకంగా ఉంటాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఏదో ఒక కంపెనీలో లేదో ఎక్కడ ఒక చోట పని చేసి ఉంటే ఈ కథనం రాసే అవసరం మాకు.. చదవాల్సిన అవసరం మీకూ ఉండేది కాదు. ఒళ్లు వంచి పని చేయడం ఇష్టం లేక.. జల్సా లకు అలవాటు పడి.. దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఒంటరి మహిళలను.. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. రాత్రిపూట రెక్కి నిర్వహించడం.. పగటిపూట ఎవరూ లేని సమయంలో చోరీలు చేయడం ఇతడి స్టైల్. పైగా ఇతడు చోరీలు చేసిన తర్వాత రెండో కంటికి తెలియకుండా అక్కడి నుంచి జారుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్షమవుతాడు. అప్పుడిక అతడు తనలో ఉన్న నటనా విశ్వరూపాన్ని చూపిస్తుంటాడు. తెలివిగా తప్పించుకుంటాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు అటు కనిపించడు. దొంగిలిచిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటాడు. దొంగిలించిన సొమ్మును తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకు విక్రయించి.. అటు నుంచి అటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు.. చాలా రోజుల తర్వాతకి మళ్ళీ బయటికి వచ్చి చోరీ వ్యవహారం కొనసాగిస్తుంటాడు.
ప్రశాంత్ ఇటీవల కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో ఏడు నెలల గర్భిణీపై దాడి చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆమెపై దాడి చేసి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు అక్కడికి వచ్చాడు. డయల్ 100 కు ఫోన్ చేశాడు.. అయితే ఈలోగా ఆ గర్భిణీ స్పృహలోకి రావడంతో ప్రశాంత్ బండారం బయటపడింది. ఆ తర్వాత పోలీసులు అతడిని సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. ప్రశాంత్ దగ్గరనుంచి దాదాపు ఎనిమిది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ప్రశాంత్ ఇప్పుడే కాదు గతంలోనూ ఇదే తరహా దొంగతనాలు చేశాడు. ముందుగా తాళం వేసి ఉన్న ఇళ్ళను చూడటం.. ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించడం.. ఆ తర్వాత పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇక ఒంటరిగా ఉన్న మహిళలను మాటల్లో పెట్టి.. వారి ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకెళ్లేవాడు. ఇలా దోచుకెళ్లిన బంగారాన్ని తనకు తెలిసిన వ్యక్తులకు విక్రయించేవాడు. ఆ తర్వాత ఆ నగదు తో దూరప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసేవాడు. చోరీలు జరిగినప్పుడు స్థానికులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేవాడు. తనమీద అనుమానం రాకుండా చూసుకునేవాడు. దృశ్యం సినిమాలో మాదిరిగా వ్యవహరించేవాడు. అయితే ఈ ఏడు నెలల గర్భిణి ప్రశాంత్ వ్యవహార శైలిపై కుటుంబ సభ్యులు చెప్పడం.. కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. అప్పటికి ప్రశాంత్ ఆచూకీ లభించకపోవడంతో సెల్ఫోన్ సిగ్న సాధారణంగా అతడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని వారిదైన శైలిలో విచరించగా ప్రశాంత్ బండారం బయటపడింది. ప్రశాంత్ దగ్గర నుంచి పోలీసులు దాదాపు 8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు..
” ఏడు నెలల గర్భిణీ పై దాడి జరిగినట్టు మాకు ఫిర్యాదు వచ్చింది. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును చోరీ చేసినట్టు ఆమె బంధువులు మాకు ఫిర్యాదు చేశారు. గర్భిణి స్పృహలోకి వచ్చేంతవరకు మేము ఎదురు చూశాం. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె వివరాలను కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్పారు. ఆ తర్వాత అతడు పరారీలో ఉన్నాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నాం. అతడి దగ్గర నుంచి ఎనిమిది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం.. గర్భిణీ పై దాడి చేసిన తర్వాత.. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ప్రశాంత్ బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి మాకు ఫోన్ చేశాడు . అంతేకాదు ఆ దొంగను శిక్షించాలని మమ్మల్ని కోరాడు. కానీ అతడి బండారం బయటపడటంతో ఇప్పుడు తలదించుకున్నాడని” కమలాపూర్ మండల పోలీసులు చెబుతున్నారు.