Mahesh Babu Rajamouli: తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్లాప్ అవ్వలేదు. కారణం ఏంటి అంటే ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఉండే విధంగా చూసుకుంటాడు. తద్వారా సినిమాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తూనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పుడు నాలుగో షెడ్యూల్ కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు చేత షర్ట్ విప్పించి తన ఫుల్ బాడీని ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నారట. దానికి మహేష్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్ లో విపరీతంగా వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
నిజానికి సుకుమార్ తో చేసిన ‘ వన్ నేనొక్కడినే’ సినిమాలో సైతం మహేష్ బాబు షర్టు లేకుండా కనిపించాల్సిన సీను ఒకటి ఉంది. కానీ అతనికి అప్పటికి సిక్స్ ప్యాక్ సరిగ్గా రాకపోవడంతో ఆ షాట్ ని తీసేసారు. ఆ దానికి బదులు చొక్కా లేకుండా ఉన్న మహేష్ బాబు బ్యాక్ షాట్ ను పెట్టారు. అది చాలా ఇంప్రెస్సివ్ గా అనిపించింది. మొత్తానికైతే మహేష్ బాబు ను షర్టు లేకుండా చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఈ సినిమాలో అలాంటి ఒక సీన్ ని క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక షర్టు తీసిన తర్వాత ఆయన బాడీ మీద ఉన్న టాటూస్ ను చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారని కూడా చెబుతున్నారు. ఎందుకంటే అతని బాడీ మీద ఢమరుకాన్ని పట్టుకున్న శివుడి రూపంతో ఒక టాటూ ఉంటుందట…
సినిమా మొత్తానికి ఈ సీన్ హైలైట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి అంటేనే యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా హై లెవెల్లో చిత్రీకరిస్తూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో సైతం అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించిన ఆయన వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు…