Bigg Boss 9 Telugu Bharani: సీరియల్స్ లో విలన్ గా ఒక రేంజ్ పాపులారిటీ ని సంపాదించుకున్న భరణి, నిజ జీవితం లో మాత్రం చాలా సున్నితమైన వ్యక్తి అని బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లోకి ఆయన ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టినప్పుడే అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రేలంగి మావయ్య ఇమేజి ని సొంతం చేసుకున్నాడు. అందరితో చాలా మంచిగా ఉంటూ, మంచోడు అని అనిపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్టుగా గా చూసే ఆడియన్స్ కి అనిపించింది. అయితే హౌస్ లో ఎక్కువగా కంటెస్టెంట్స్ తో రిలేషన్స్ పెంచుకోవడం భరణి ఆట ని బాగా దెబ్బ తీస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న స్పష్టంగా అది చూసే ఆడియన్స్ కి అర్థం అయ్యింది. తనూజ నాన్న అని పిలుస్తూ ఆయన చుట్టూ తిరుగుతుంది, అదే విధంగా దివ్య పెద్ద అన్న అని పిలుస్తూ ఈయన చుట్టూనే తిరుగుతుంది.
వీళ్లిద్దరి తో పాటు రీతూ చౌదరి కి సహాయం చేస్తానని మాటిచ్చాడు. ఇక రాము అంటే మొదటి నుండి ఈయనకు ఇష్టం ఉంది, సమయం వచ్చినప్పుడు, తన చేతుల్లో అవకాశం ఉన్నప్పుడు కెప్టెన్ ని కూడా చేసాడు. ఇలా ఆయన ఇతరుల కోసం చేయడమే తప్ప, తన ఆట ఏంటో ఇప్పటి వరకు చూపించలేదు. నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో ఒక పెద్ద పరుపు మీద కంటెస్టెంట్స్ అందరూ నిల్చొని, చివరి వరకు ఎవరెవరు అయితే పరుపు మీద ఉంటారో వాళ్ళు మాత్రమే నామినేషన్స్ నుండి తప్పించుకోవచ్చు అని అంటాడు బిగ్ బాస్. దీంతో అందరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ వచ్చారు. చివరికి దివ్య వంతు వస్తుంది. దివ్య ని నలుగురు పట్టుకొని బయటకు తోసేస్తారు. ఆ సమయం లో భరణి కి వాళ్ళని ఆపి దివ్య ని సేవ్ చేసే ఛాయస్ ఉంది.
కానీ ఆయన ఆపలేదు, సైలెంట్ గా ఏమి చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. అదే విధంగా రీతూ చౌదరి ని కూడా నలుగురు బలవంతంగా మోసుకెళ్లి కిందకి పడేసారు. అప్పుడు ఆమెతో తనూజ కూడా ఉంది. ఎక్కడ తనూజ కూడా ఆమెతో పాటు క్రిందకి పడిపోతుందో అనే భయం తో తనూజ ని పక్కకి లాగేసాడు కానీ, రీతూ చౌదరి ని మాత్రం పట్టించుకోలేదు. గేమ్ అయిపోయాక రీతూ చౌదరి మాట్లాడుతూ ‘మీరు సహాయం చేస్తాను అని చెప్పినప్పుడు మేము ఆశిస్తాము కదా, అలాంటప్పుడు మాట ఇవ్వడం ఎందుకు?’ అని నిలదీస్తుంది. దివ్య కూడా మాట్లాడుతూ ‘అక్కడ అంత మంది నన్ను టార్గెట్ చేస్తే మీరెందుకు సపోర్టుగా రాలేదు. మీరు తల్చుకుంటే వాళ్ళందరిని ఆపగలరు’ అని అంటుంది. భరణి నుండి ఎలాంటి సమాధానం లేదు. ఇలా ఆయన బంధాల మధ్య నలిగిపోతూ గేమ్ ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఇలాగే కొనసాగితే టాప్ 5 వరకు వెళ్లడం అసాధ్యం అనే చెప్పాలి.