Nithin And Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. కొందరు విలక్షణమైన నటనతో నట విశ్వరూపాన్ని చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటే, మరి కొంతమంది మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి బంపర్ హిట్లను అందుకుంటున్నారు. ఇక ఎవరు ఏది చేసిన కూడా అల్టిమేట్ గా ఇక్కడ సక్సెస్ సాధించిన వాళ్లకు మాత్రమే గుర్తింపైతే ఉంటుంది. ప్లాప్ లు వచ్చిన హీరోలు ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోక తప్పదు…జయం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయన నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన తోటి హీరోలందరూ స్టార్ హీరోలుగా వెలుగుందుతుంటే ఆయన మాత్రం ఇంకా టైప్ 2 హీరో గానే ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు సినిమాతో భారీ డ్డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న సినిమాలు ఏ మేరకు సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక నితిన్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు.
దానివల్లే ఆయన సినిమాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో చూసి అతని సినిమాలు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు దోహదపడుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ కానీ, ఆయన సినిమాలోని సాంగ్స్ కానీ, ఆయన చెప్పిన డైలాగులను కానీ నితిన్ తన సినిమాలో వాడుకొని ప్రేక్షకుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు.
ఇందులో పవన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీరా’ అనే పేరుతో కనిపించాడు. కాబట్టి నితిన్ సైతం ఇప్పుడు ‘గంభీరా’ అనే టైటిల్ తో సినిమాని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక నితిన్ ఈ టైటిల్ ని కనుక వాడుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు ఈసారి అతని మీద కొంతవరకు తీవ్రమైన కోపంతో ఉండే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే నితిన్ తన స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నాడు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా కానీ సినిమా కెరియర్ పరంగా కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు ఏమాత్రం సపోర్టుగా ఉండటం లేదు. కనీసం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేయడం లేదని అభిమానులు నితిన్ మీద చాలా వరకు కోపంతో ఉన్నారు…నితిన్ నిజంగానే గంభీరా అనే టైటిల్ ను వాడుకుంటున్నాడా? లేదంటే కావాలని సోషల్ మీడియాలో కొంతమంది ఈ రూమర్ ను స్ప్రెడ్ చేస్తున్నారా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…