Guntur Kaaram: మహేష్ బాబును ములక చెట్టు ఎక్కించిన ఆ పెద్దాయన ఎవరు? ఆ కౌగిలింతకు అర్థం ఏమిటీ?

మహేష్ కూడా మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాడట. యాడ్ షూట్ లో భాగమైన కొందరు ఈ మేటర్ బయటకు లీక్ చేశారు. తీరా విడుదలయ్యాక చూస్తే ఫలితం వేరు. గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Written By: NARESH, Updated On : January 13, 2024 12:48 pm

Guntur Kaaram Collections

Follow us on

Guntur Kaaram: పొగిడితే పడిపోని వారుండరు. అది పొగడ్త అని తెలిసినా మనసులో ఒక హాయి భావన కలుగుతుంది. చిత్ర పరిశ్రమలో ఈ ముఖస్తుతి అనే మందు బాగా పని చేస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల చుట్టూ పెద్ద భజన బ్యాచ్ ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, నటులు వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి సదరు స్టార్ హీరో ఒక్క ఛాన్స్ ఇచ్చే వాళ్లకు ఒరిగే ప్రయోజనం భారీగా ఉంటుంది.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… గుంటూరు కారం విషయంలో ఓ పెద్దాయన మహేష్ ని ఇలానే ములక చెట్టు ఎక్కించాడట. గుంటూరు కారం కొద్దిరోజుల్లో విడుదల అనగా మహేష్ ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. అక్కడకు స్వయంగా వెళ్లిన సదరు పెద్దాయన మహేష్ ని కౌగిలించుకున్నాడట. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూశాను. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నాడట.

మహేష్ కూడా మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాడట. యాడ్ షూట్ లో భాగమైన కొందరు ఈ మేటర్ బయటకు లీక్ చేశారు. తీరా విడుదలయ్యాక చూస్తే ఫలితం వేరు. గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ ప్రజెన్స్ తప్పితే… చెప్పుకోవడానికి ఏమీ లేదు. కథ, కథనంలో మేటర్ లేదు. దర్శకుడు త్రివిక్రమ్ కనీసం శ్రద్ద పెట్టకుండా తెరకెక్కించాడనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో పెద్దాయన వ్యవహారం తెరపైకి వచ్చింది.

అసలు ఈ పెద్దాయన ఎందుకు అలా చెప్పాడు? ఎవరా పెద్దాయన? మహేష్ కి ఇచ్చిన ఆ కౌగిలింత వెనుక కారణం? ఏమిటనే చర్చ మొదలైంది. గుంటూరు కారం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైంది. మహేష్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించాడు. గుంటూరు కారం మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.