https://oktelugu.com/

Prabhas: ఎవరికీ కనిపించకుండా ప్రభాస్ చేసిన పనికి అంతా షాక్

మంగుళూరులో గల కటీలు దుర్గా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ప్రభాస్ తలకు నెట్ క్యాప్, ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు. దీంతో ప్రభాస్ ని ఎవరూ గుర్తించలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2024 / 01:00 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: ప్రభాస్ సలార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి ఫ్యాన్స్ కోరుకుంటున్న మూవీ పడింది. సలార్ సక్సెస్ నేపథ్యంలో ప్రభాస్ ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. ఇదంతా ఆయన రహస్యంగా చేశారు.

    మంగుళూరులో గల కటీలు దుర్గా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ప్రభాస్ తలకు నెట్ క్యాప్, ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు. దీంతో ప్రభాస్ ని ఎవరూ గుర్తించలేదు. సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ తో పాటు ప్రభాస్ దుర్గా పరమేశ్వరి దర్శనం చేసుకున్నారు. ఆలయం సమితి సభ్యులు ప్రభాస్ కి అమ్మవారి ఫోటో బహుకరించారు. ప్రభాస్ అని తెలిశాక అక్కడున్న జనాలు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. ప్రభాస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

    సలార్ కి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో అది పట్టాలెక్కే సూచనలు కలవు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2829 AD, రాజా డీలక్స్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు సెట్స్ పై ఉన్నాయి. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. అశ్వినీదత్ నిర్మాత. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటించడం విశేషం.

    కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కల్కి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, దిశా పటాని సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ చేస్తున్నారు. ఇది కొంత మేర షూటింగ్ జరుపుకుంది. ఇది కామెడీ హారర్ మూవీ అని ప్రచారం జరుగుతుంది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు.