Nithiin Rapido Driver: కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాల్లో చీకటిని నింపింది. ఈ మహమ్మారి తర్వాత కొందరి జీవితాలు తల క్రిందలు అయ్యాయి, అందులో సినీ హీరోలు కూడా ఉన్నారు , వారిలో యంగ్ హీరో నితిన్ ఒకరు. కెరీర్ ప్రారంభం లోనే ఇండస్ట్రీ హిట్ తరహా సినిమాల్లో హీరోగా నటించిన ఆయన , ఆ తర్వాత సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడంతో చాలా రోజుల పాటు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకున్నారు. ఇక హీరో గా కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయనకు ‘ఇష్క్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తగిలింది. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2020 వరకు కెరీర్ పీక్ రేంజ్ లోనే సాగింది. కానీ ఆ తర్వాత నితిన్ కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
‘భీష్మ’ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఈ కారణం చేత ఇప్పుడు నితిన్ కెరీర్ ‘ఇష్క్’ కి ముందు ఎలా ఉన్నిందో , ఇప్పుడు దాదాపుగా అలాగే ఉంది. మరోసారి ఆయనకు భారీ కం బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి మిడిల్ క్లాస్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఒక స్టోరీ ని ఎంపిక చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నారి & సోమశేఖర్ అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైత్యన్య హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతం లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత కొన్ని రోజుల నుండి జరుగుతోంది. రీసెంట్ గా నితిన్ , వైష్ణవి చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
నితిన్ ఈ సన్నివేశం లో ఒక ‘Rapido’ డ్రైవర్ గా కనిపించారు. ఆయన వెనుక హీరోయిన్ వైష్ణవి చైతన్య కూర్చుంది. చూస్తుంటే ఈసారి నితిన్ కం బ్యాక్ ఇచ్చే స్టోరీ నే ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి రూటెడ్ చిత్రాలకు ఆడియన్స్ నుండి ఎల్లప్పుడూ మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే నితిన్ ఈసారి కొట్టే దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఈ చిత్రం తర్వాత కూడా నితిన్ స్క్రిప్ట్స్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వాస్తవానికి నితిన్ కి రీసెంట్ టైం లో పెద్ద అవమానమే జరిగింది. దిల్ రాజు ప్రస్తుతం నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో ముందుగా నితిన్ హీరో అనే సంగతి తెలిసిందే. కానీ దిల్ రాజు అంతకు ముందు నితిన్ తో తీసిన ‘తమ్ముడు’ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా నుండి నితిన్ ని తప్పించారు. ఇలాంటి అవమానాలకు నితిన్ ఈ సినిమాతో ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.
