spot_img
Homeఎంటర్టైన్మెంట్అనసూయ గురించి ఆసక్తికరమైన సంగతులు !

అనసూయ గురించి ఆసక్తికరమైన సంగతులు !

Anasuya‘జబర్థస్త్’ యాంకర్‌ గా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. కాగా నేడు అనసూయ బర్త్‌ డే. దాంతో నెటిజన్లు అనసూయకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అనసూయ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు..

అనసూయ సొంతూరు నల్లగొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లి. ఆమె మే 15,1985లో పుట్టింది. మొదట అనసూయ అమ్మగారు ఆమెకు పవిత్ర అని పేరు పెట్టాలని ఆశ పడిందట. అయితే అనసూయ తండ్రి వాళ్ల అమ్మగారి పేరు అయిన ‘అనసూయ’ పేరునే, తన కూతురికి పెట్టాలని పట్టుబట్టి అనసూయ అని పేరు పెట్టారు. చిన్నతనంలో అనసూయ కుటుంబం ఆర్థికంగా బాగుండేది. అయితే అనసూయ తండ్రికి గుర్రెపు పందెల వ్యసనం ఉండేది.

ఆ వ్యసనం కారణంగా అనసూయ ఫ్యామిలీ ఆస్తులన్ని పోగొట్టుకుని చాల కష్టాలు పడ్డారు. అనసూయ అమ్మగారు కుట్టు మిషన్‌ కుడుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారంటేనే.. వాళ్ళ ఫ్యామిలీ ఎంతగా ఇబ్బందులు పడిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే చిన్నతనం నుండే అనసూయ బాగా చదివేది. ఎంబీఏలో హెచ్‌ఆర్‌ కూడా చేసింది. తొలుత ఓ బ్యాంకులో టెలీకాలర్‌ గా కూడా పనిచేసింది.

అన్నట్టు ఆమె ఆ బ్యాంక్ లో పని చేసే సమయంలో, ఆమె జీతం రూ. 5 వేలు. ఆ ఐదు వేలు నుండి మొదలైన అనసూయ ప్రస్థానం, ఇప్పుడు రోజుకు లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి వచ్చింది. ఇక అనసూయ యాంకర్ గా మారకముందు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ గా కూడా కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే దర్శకుడు సుకుమార్ ఆమెను చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట. అయితే ఆమె యాంకర్ గా మారిన తరువాతే, ఆమె నటిగా టర్న్ తీసుకుంది.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper