దేశంలోకి కొత్త రకం వ్యాక్సిన్లు వస్తున్నాయి. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటు సైతం అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి టీకాల అవసరం ఏర్పడింది. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉత్పత్తులను అనుమతించాలని దరఖాస్తులు పెట్టుకున్నా వాటికి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సైతం విషమ పరిస్థితులను గుర్తించి కరోనా ఊపును తగ్గించడంలో వ్యాక్సిన్ల ప్రభావాన్ని గుర్తించి వాటి వినియోగానికి అనుమతులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
మార్కెట్లోకి ఫైజర్
అమెరికాలో తయారైన వ్యాక్సిన్ పైజర్. దేశంలో వినియోగించుకోవాలని గతంలోనే దరఖాస్తు చేసుకుంది. అయితే ఔషధనియంత్రణ సంస్థతో సమావేశంజరిగిన తరువాత ఫైజర్ తనదరఖాస్తును వెనక్కి తీసుకుంది. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖం పట్టింది.ఫలితంగా సెకండ్ వేవ్ తన ప్రభావాన్ని చూపెట్టింది. దీంతో వేలల్లో మరణాలు సంభవించాయి. ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. కరోనా రక్కసి ప్రభావానికి గురైతే మరణంవరకు వెళ్లాల్సి వస్తుందని గజగజ వణికారు. కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు దేశంలోకి స్పుత్నిక్ అనే మరో వ్యాక్సిన్ కూడా రానుంది. దీంతో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టే వీలుంటుంది. ఇప్పటికే పలు దఫాలుగా టీకాలు వేయించుకున్న ప్రజలు వ్యాక్సిన్ల వినియోగం పెరిగితే వాటి డోసులు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రక్కసిని కట్టడి చేయడం సాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికాలో అదరగొడుతున్న పైజర్
అమెరికాలో కరోనా వైరస్ దాటిని తగ్గించేందుకు ఫైజర్ వ్యాక్సిన్ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ స్వయంగా ఫైజర్ టీకా వేయించుకున్న వారు మాస్కులు అవసరం లేకుండా తిరుగుతున్నారని ప్రకటించడం వెనుక ఫైజర్ శక్తి సామర్థ్యాలు తెలుస్తున్నాయి. అందుకే ఫైజర్ టీకాను మన దేశంలో కూడా వినియోగించి కరోనా రక్కసిని రూపుమాపాలని ప్రజలు కోరుతున్నారు.
వినియోగంపై దృష్టి
కరోనా నిర్మూలనకు వ్యాక్సినేషన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ వినియోగానికి ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ప్రతి రాష్ర్టంలో కరోనా నిర్మూలన చేసేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ వేయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రాంతాల వారీగా ఎందరు ఉన్నారు? వారికి ఎంత మేరకు అవసరం అని భావించి వాటిని సరఫరా చేసేందుకు ముందుకు వస్తోంది.