‘జబర్థస్త్’ యాంకర్ గా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. కాగా నేడు అనసూయ బర్త్ డే. దాంతో నెటిజన్లు అనసూయకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అనసూయ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు..
అనసూయ సొంతూరు నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి. ఆమె మే 15,1985లో పుట్టింది. మొదట అనసూయ అమ్మగారు ఆమెకు పవిత్ర అని పేరు పెట్టాలని ఆశ పడిందట. అయితే అనసూయ తండ్రి వాళ్ల అమ్మగారి పేరు అయిన ‘అనసూయ’ పేరునే, తన కూతురికి పెట్టాలని పట్టుబట్టి అనసూయ అని పేరు పెట్టారు. చిన్నతనంలో అనసూయ కుటుంబం ఆర్థికంగా బాగుండేది. అయితే అనసూయ తండ్రికి గుర్రెపు పందెల వ్యసనం ఉండేది.
ఆ వ్యసనం కారణంగా అనసూయ ఫ్యామిలీ ఆస్తులన్ని పోగొట్టుకుని చాల కష్టాలు పడ్డారు. అనసూయ అమ్మగారు కుట్టు మిషన్ కుడుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారంటేనే.. వాళ్ళ ఫ్యామిలీ ఎంతగా ఇబ్బందులు పడిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే చిన్నతనం నుండే అనసూయ బాగా చదివేది. ఎంబీఏలో హెచ్‌ఆర్ కూడా చేసింది. తొలుత ఓ బ్యాంకులో టెలీకాలర్ గా కూడా పనిచేసింది.
అన్నట్టు ఆమె ఆ బ్యాంక్ లో పని చేసే సమయంలో, ఆమె జీతం రూ. 5 వేలు. ఆ ఐదు వేలు నుండి మొదలైన అనసూయ ప్రస్థానం, ఇప్పుడు రోజుకు లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి వచ్చింది. ఇక అనసూయ యాంకర్ గా మారకముందు విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్‌ఆర్ గా కూడా కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే దర్శకుడు సుకుమార్ ఆమెను చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట. అయితే ఆమె యాంకర్ గా మారిన తరువాతే, ఆమె నటిగా టర్న్ తీసుకుంది.