https://oktelugu.com/

అంత్యక్రియలకు ముందు.. కళ్లు తెరిచిన వృద్ధురాలు

కరోనా బారిన పడిన ఒక వృద్ధురాలు ఆచేతనంగా ఉండటంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా ఆమె కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. మహారాష్ట్ర బారామతిలోని ముధలే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 76 ఏండ్ల శకుంతల గైక్వాడ్ కు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉంచారు. అమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పడకలు లేక అడ్మిట్ చేసుకోలేదు. అచేతనంగా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 15, 2021 / 03:25 PM IST
    Follow us on

    కరోనా బారిన పడిన ఒక వృద్ధురాలు ఆచేతనంగా ఉండటంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా ఆమె కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. మహారాష్ట్ర బారామతిలోని ముధలే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 76 ఏండ్ల శకుంతల గైక్వాడ్ కు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉంచారు. అమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పడకలు లేక అడ్మిట్ చేసుకోలేదు. అచేతనంగా కదలకుండా ఉన్నది. దీంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. తిరిగి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాడె మీద పడుకోబెట్టారు. బంధువులు పెద్దగా ఏడ్వగా ఆ ముసలావిడ ఒక్కసారిగా కళ్లు తెరిచి ఏడ్వసాగింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు ఆమెను బారామతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.