Insulted Chiranjeevi in Bollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేశాడు. ఇండస్ట్రీలో ఎవరికి లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మెగాస్టార్ గా అవతరించిన ఆయన యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడనే చెప్పాలి… ఎటువంటి సినిమా బ్యాక్రౌండ్ లేనప్పటికీ ఒక సామాన్యుడు సైతం సినిమా ఇండస్ట్రీలో రాణించగలడు అనే ఎగ్జాంపుల్ ని సెట్ చేసిన నటుడు కూడా తనే కావడం విశేషం…70 సంవత్సరాల వయసులో కూడా భారీ ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్లో చేస్తున్న విశ్వంభర సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వశిష్ట (Vashishta) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో చిరంజీవి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.
Also Read: మహేష్ బాబు – చిరంజీవి కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు ఇవేనా..?
మరి ఈ ఏజ్ లో సైతం యంగ్ హీరోలకు పోటీని ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి తను ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు చిరంజీవి బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది మన స్టార్ హీరోలందరు బాలీవుడ్ లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో చేయబోతున్న సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేసి ఎలాగైనా సరే ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి బాలీవుడ్ లో తనను ఎవరైతే ఒకప్పుడు అవమానించారో వాళ్ళందరి ముందు మెగాస్టార్ అని తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: సౌత్ హిట్ చిత్రాలతో బాలీవుడ్ సీక్వెల్స్… ఇదేం ట్రెండ్ రా బాబు!
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మనవాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రిని టచ్ చేయాలంటే కూడా భయపడేవారు. ఎందుకంటే అక్కడ ఉన్న మాఫియా మన హీరోలను అక్కడికి రానిచ్చే వాళ్ళు కాదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని సైతం వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే అక్కడ ఉన్న స్టార్ హీరోల హవా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మాఫియా కూడా వేరే హీరోలను అక్కడ ఎదగనించేవారు కాదు. కానీ ఇప్పుడు హద్దులన్నీ చెరిగిపోయాయి. ఎవరైనా సరే వాళ్లకు నచ్చిన సినిమా చూడడానికి అవకాశం ఉంది. అలాగే నచ్చిన సినిమాని ఎంకరేజ్ చేసుకునే అవకాశం ఉండటం వల్ల మన హీరోలకు సర్కిల్ కూడా భారీగా పెరిగింది…