Mahesh Babu Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ (Krishna)నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు (Mahesh Babu)….ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది. ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… అయితే మహేష్ బాబు మొదటి నుంచి కూడా మల్టీ స్టార్లర్ సినిమా చేయడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన వెంకటేష్ (Venkatesh) తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Sethamma Vakitlo Sirimalle Chettu) అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా మహేష్ బాబుకు చాలా మంచి క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు చిరంజీవితో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలు అయితే సెట్ అవ్వలేదు.
Also Read: హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊహించని మార్పులు..ముఖ్య అతిధులు ఎవరంటే!
ముఖ్యంగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘ ఖైదీ నెంబర్ 150’ (Khaidi Number 150) సినిమాలో మహేష్ బాబు కోసం మొదట ఒక గెస్ట్ రోల్ ని క్రియేట్ చేశారట. కానీ ఆ గెస్ట్ రోల్ కి సినిమాలో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చునే ఉద్దేశ్యంతో దానిని క్యాన్సిల్ చేశారు. ఇక ఆ తర్వాత ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ (Ram Charan) చేసిన పాత్రను మహేష్ బాబుతో చేయించాలని కొరటాల శివ చిరంజీవి ఇద్దరు భావించారు.
కానీ లాస్ట్ మినిట్ లో అది వర్కౌట్ కాలేదు…ఇక వాల్తేరు వీరయ్య (Valteeru Veerayya) సినిమాలో రవితేజ చేసిన క్యారెక్టర్ ని ఇంకాస్త బెటర్మెంట్ చేసి మహేష్ బాబు తో చేయించాలనే ఆలోచన చిరంజీవికి వచ్చినప్పటికీ అది కూడా సాధ్యపడలేదు. మొత్తానికైతే చిరంజీవి మహేష్ బాబు కాంబినేషన్లో రావాల్సిన సినిమాలు ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అవుతూ వచ్చాయి.
Also read: ’హరి హర వీరమల్లు’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే
మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం చిరంజీవి, మహేష్ బాబు ఇద్దరు ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇక మీదట కూడా భారీ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు…