Celebrity love marriages: ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం కనిపించదు. నచ్చిన వ్యక్తి చెంతనే ఉన్నప్పుడు లోకం గురించి పట్టింపు ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రేమ పక్కకు వెళ్లి ద్వేషం ఇతర పైకి వస్తుందో.. ఎప్పుడైతే నచ్చిన వ్యక్తిలో లోపాలు కనిపిస్తాయో.. అప్పుడు ఆ బంధం బీటలు వారుతుంది. చివరికి పెటాకులకు దారితీస్తుంది. సామాన్యులు నచ్చిన వారి విషయంలో తగ్గి ఉంటారేమో గాని.. సెలబ్రిటీలు ఏమాత్రం తగ్గరు. తగ్గాలని కూడా అనుకోరు.
Also Read: వింబుల్డన్ పోటీలు చూసేందుకు ఇండియన్ సెలబ్రిటీలు వెళ్లేది అందుకే? సామాన్యులకు అంతు పట్టని విషయం ఇది..
మనదేశంలో సెలబ్రిటీల ప్రేమలు.. పెళ్లిళ్లు.. విడాకులు ఒకప్పుడు అంతగా ఉండేవి కాదు. కానీ ఇటీవల కాలంలో సెలబ్రిటీల వైవాహిక జీవితాలు చూస్తుండగానే విచ్ఛిన్నమవుతున్నాయి. అప్పటిదాకా ప్రేమలో ఉండి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని.. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని.. స్వేచ్ఛగా విహరించిన వారు.. ఒక్కసారిగా తమ ధోరణి మార్చుకుంటున్నారు. అందరికీ షాక్ ఇస్తూ తమ సపరేట్ అయిపోయామని సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. తద్వారా అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఈ ధోరణి స్పోర్ట్స్ సెలబ్రిటీలలో పెరిగిపోయింది.
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన భర్త కశ్యప్ తో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించడం ఒక్కసారిగా సంచలనానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ సెలబ్రిటీల విడాకులపై చర్చ మొదలైంది. సైనా, కశ్యప్ మధ్య దశాబ్దాల పరిచయం ఉంది. వీరిద్దరూ సుదీర్ఘకాలం ప్రేమలో ఉండి వివాహం చేసుకున్నారు. పైగా వీరి వివాహం జరిగి కూడా ఏడు సంవత్సరాలు అవుతోంది. అలాంటి వీరిద్దరూ విడాకులు తీసుకోవడంఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి సైనా ఇలాంటి ప్రకటన చేస్తుందని ఎవరూ ఊహించలేదు. పైగా కశ్యప్ తో ఆమె రిలేషన్ మొన్నటిదాకా బాగానే ఉండేది. ఇటీవల కాలంలో ఏర్పడిన విభేదాలు వారిద్దరి మధ్య విడాకులకు దారితీసాయి.
Also Read: సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ సంచలన నిర్ణయం.. షాక్ కు గురైన అభిమానులు
కేవలం సైనా మాత్రమే కాదు, గతంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రేమ వివాహం చేసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాస్తవానికి అతడిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు చాలా గొడవలు జరిగాయి. అయినప్పటికీ ఆమె 2010లో అతడిని వివాహం చేసుకున్నారు.. పాకిస్తాన్ వధువుగా మారారు. అయితే సానియాతో ఒక కుమారుడు జన్మించిన తర్వాత.. షోయబ్ మరో మహిళతో సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం తెలిసిన సానియా అతడికి దూరంగా జరిగింది. దీంతో గత ఏడాది అతనితో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతేకాదు విడాకుల ప్రకటన చేస్తున్నప్పుడు ఆమె చాలా భారమైన పదాలు వాడింది. వివాహం అనేది క్లిష్టమైన ప్రక్రియ అని.. దానిని పదికాలాలపాటు కాపాడుకోవాలంటే ఓర్పు ఉండాలని.. సహనం కూడా అదే స్థాయిలో ఉండాలని సానియా వ్యాఖ్యానించింది. అంతేకాదు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని ఆమె పేర్కొంది. విడాకులు అనేది అత్యంత దారుణమైన విషయమని ఆమె ఆ సమయంలో వివరించింది. విడాకులపై సానియా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం సృష్టించాయి.