https://oktelugu.com/

శోభన్ బాబు వల్లే ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్స్ !

జ్ఞాపకం అనేది.. గడిచినపోయిన జీవితానికి ఓ తీపిగుర్తు. నిజంగా జ్ఞాపకాలైనా.. గొప్పవాళ్ళ పాత విషయాలైనా వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ రెండు సూపర్ హిట్ సినిమాల గురించి సోషల్ మీడియాలో అప్పటి విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ కెరీర్ లో 1977 సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉందట. ఆ ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదలైన దానవీర శూరకర్ణ సినిమాతో బాక్సాఫీస్ కొత్త రికార్డ్స్ మార్కును దాటేసింది. […]

Written By: , Updated On : June 30, 2020 / 08:29 PM IST
Follow us on


జ్ఞాపకం అనేది.. గడిచినపోయిన జీవితానికి ఓ తీపిగుర్తు. నిజంగా జ్ఞాపకాలైనా.. గొప్పవాళ్ళ పాత విషయాలైనా వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ రెండు సూపర్ హిట్ సినిమాల గురించి సోషల్ మీడియాలో అప్పటి విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ కెరీర్ లో 1977 సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉందట. ఆ ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదలైన దానవీర శూరకర్ణ సినిమాతో బాక్సాఫీస్ కొత్త రికార్డ్స్ మార్కును దాటేసింది. అది సెకండ్ రిలీజులోనూ కోటి వసూలు చేయడం విశేషం. పైగా కర్ణ హవా నడుస్తుండగానే … ఏప్రిల్ నెలలో అడవి రాముడు విడుదలై.. ఏకంగా నాలుగు కోట్ల వసూళ్లు సాధించి తెలుగు సినిమా స్టామినా పెంచింది. అదే ఏడాది అక్టోబర్ లో యమగోల విడుదలై అప్పటివరకు ఉన్న రికార్డ్స్ ను షేక్ చేసి పారేసింది.

బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!

ఇలా ఎన్టీఆర్ క్రేజ్ ను ఎవ్వరూ అందుకోలేనంతగా ఆయనకు అద్భుత విజయాలనూ అందించిన అడవి రాముడు, యమగోల రెండు చిత్రాలు నిజానికి శోభన్ బాబు చేయాల్సినవి అట. నిర్మాత సూర్యనారాయణగారు గందనగుడి అనే ఓ కన్నడ సినిమా చూసి ముళ్లపూడి వెంకటరమణగారితో కథ తయారు చేయించి… శోభన్ బాబుకు వినిపించారట. ఆయనకి కథ చెప్పగానే అడవి బ్యాక్ డ్రాప్ లో కథ ఎక్కువ రోజులు ఔట్ డోరు ఇలా ఆలోచించి అడవిరాముడు సినిమాని వద్దనుకున్నారు. అలా ఆ కథ ఎన్టీఆర్ దగ్గరకు పోవటం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట.

టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

మొదట రాఘవేంద్రరావుకి ఈ విషయం చెప్తే ఆయన తనను జోక్ చేయడానికి చెప్తున్నారనుకున్నాట్ట. చివరకి సీరియస్ వ్యవహారమే అని తెల్సాక … ముళ్లపూడి వారి కథను దగ్గర పెట్టుకుని గొల్లపూడి తో కూర్చుని కమర్షియల్ కథగా మార్చే కసరత్తు ప్రారంభించి ఎన్టీఆర్ కు కొత్త ఇమేజ్ ఇచ్చేలా కథ తయారు చేసుకున్నారు. అలాగే మాటల రచయితగా జంధ్యాలను తీసుకున్నారు. అలా తెరకెక్కిన అడవిరాముడుతో సెన్సేషనల్ హిట్ ను అందుకున్నారు. సేమ్ అదేవిధంగా యమగోల సినిమా కూడా శోభన్ బాబు నుండి ఎన్టీఆర్ దగ్గరకి వెళ్ళింది. ఎన్టీఆర్ కు మరో సూపర్ హిట్ సినిమాని అందించింది. మొత్తానికి శోభన్ బాబు వల్ల ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి.