https://oktelugu.com/

పబ్జి, జూమ్.. చైనా యాప్స్ కాదట..!

కేంద్రం ప్రభుత్వం తాజాగా 59 చైనా యాప్స్ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయలో భారత జవాన్లపై చైనా దొంగదెబ్బ తీసింది. గాల్వానా ఘర్షణలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందడంతో యావత్ భారత్ చైనాకు వ్యతిరేకంగా నినదించింది. ఓవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు చైనా దొంగదెబ్బతీయడంపై భారతీయులు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరజవాన్లకు ఘనంగా నివాళ్లర్పించారు. ఈనేపథ్యంలో చైనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2020 / 08:16 PM IST
    Follow us on


    కేంద్రం ప్రభుత్వం తాజాగా 59 చైనా యాప్స్ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయలో భారత జవాన్లపై చైనా దొంగదెబ్బ తీసింది. గాల్వానా ఘర్షణలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందడంతో యావత్ భారత్ చైనాకు వ్యతిరేకంగా నినదించింది. ఓవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు చైనా దొంగదెబ్బతీయడంపై భారతీయులు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరజవాన్లకు ఘనంగా నివాళ్లర్పించారు. ఈనేపథ్యంలో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనికి భారతీయులు నుంచి మంచి స్పందన రావడంతో కేంద్రం కూడా ఆ దిశగా ప్రణాళికలను రూపొందించింది.

    టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

    చైనాను రక్షణపరంగా, ఆర్థికంగా, దౌతపరంగా అన్నివిధంగా భారత్ చైనాకు ధీటుగా జవాబిస్తుంది. ఇప్పటికే సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించి సైనికుల పూర్తి స్వేచ్ఛ కల్పించింది. త్రివిధ దళాలను సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దు చేస్తూ ఆర్థికంగానూ షాకిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసి చైనాకు గట్టి బుద్ది చెప్పింది. భారత పౌరుల సమాచారం చోరికి గురవుతుందనే కారణంతో ఈ యాప్స్ ను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

    భారత్ ప్రకటించిన చైనాకు చెందిన 59యాప్స్ లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించే టిక్ టాక్ కూడా ఉంది. భారత్ లో ఈ యాప్ కు చాలా క్రేజీ ఉంది. ఇందులో చిన్న వీడియోను పలు సాంకేతిక అంశాలతో ఈజీగా వాడుకునే సదుపాయం ఉంది. ఈ యాప్ కు భారత్లో అత్యధిక వినియోగదారులు ఉన్నారు. ఈ యాప్ వల్ల చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకొని పాపులర్ అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే ఈ యాప్ కు యువత ఎక్కువగా బానిసవడం, లైక్స్ రావడం లేదని ఆత్మహత్యలు, వేధింపులు, విడాకులు వంటివి కూడా వెలుగుచూశాయి. ఈ యాప్ తొలగించడంతో కొంతమంది టిక్ టాక్ ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు.

    బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!

    భారత్ బ్యాన్ చేసిన 59యాప్స్ లో పబ్జీ, జూమ్, వాట్సాప్ యాప్ లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పబ్జీ, జూమ్, వాట్సాప్ యాప్ చైనాకు చెందిన యాప్స్ కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే వీటిని బ్యాన్ చేయకపోవడానికి కేంద్రం వద్ద చాలా కారణాలున్నట్లు తెలుస్తోంది. అందరు అనుకున్నట్లు జూమ్ చైనా యాప్ కాదు.. జూమ్‌ని సృష్టించిన ఎరిక్ యువాన్ (EricYuan) చైనా-అమెరికన్. ఈయనకు అమెరికా పౌరసత్వం ఉంది. జూమ్, జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ కలిగిన కంపెనీ అమెరికాలో ఉంది. జూమ్‌ సంస్థ యూజర్ల సమాచారాన్ని చైనా ఇచ్చేందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం జూమ్ ను బ్యాన్ చేయలేదు.

    అదేవిధంగా పబ్జీ, వాట్సాప్ లు కూడా చైనాకు చెందినవి కాదు.. పబ్జీ(PUBG) గేమ్ యాప్ని దక్షిణ కొరియాకి చెందిన గేమ్ స్టూడియో బ్లూహోల్(Blue Hole) తయారు చేసింది. ఇది పాపులర్ అయ్యాక చైనా కంపెనీ టెన్సెంట్(Tencent) చైనాలో అనుమతిచ్చేందుకు డీల్ కుదుర్చుకుంది. ఇండియాలో ఈ గేమ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది టెన్సెంట్ అని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. పబ్‌జీ యాజమాన్య హక్కులు ఇప్పుడు ఒక్కరి చేతుల్లో లేవు. దీంతో ఈ గేమ్ యాప్ ను కేంద్రం నిషేధించలేదని తెలుస్తోంది.

    అలాగే వాట్సాప్ ను నిషేధించాలని ఎవరూ పెద్దగా డిమాండ్ చేయలేదు. ఇది కూడా చైనాకి చెందిన యాప్ కాదు. వాట్సాప్ ఫేస్‌బుక్ నిర్వహిస్తున్న యాప్. దీనివల్ల వాట్సాప్‌కి ఇండియాలో ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. ఈ యాప్స్ నుంచి వచ్చి అన్ని మేసేజ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.