Homeఎంటర్టైన్మెంట్ఘనంగా 'గుత్తా జ్వాలా' వివాహాం.. అతిధులు ఎవరంటే

ఘనంగా ‘గుత్తా జ్వాలా’ వివాహాం.. అతిధులు ఎవరంటే

ఎట్టకేలకూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ‘గుత్తా జ్వాలా’, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంట త్వరలోనే ప్రేమ వివాహాం చేసుకుంటామని ప్రకటించిన దగ్గర నుండి నెటిజన్లు ఈ పెళ్లి తంతు పై అప్ డేట్లు కోసం ఆరా తీస్తూనే ఉన్నారు. మొత్తానికి నగర శివారు మొయినాబాద్ లో ఈ జంట బంధువుల మధ్య ఒక్కటైంది. మొయినాబాద్ లోని ఎన్కేపల్లి సమీపంలోని ఓ విల్లాలో వీరిద్దరూ నిరాడంబరంగా వీరి వివాహం చేసుకున్నారు. అయితే […]

Badminton Jwala Marriage
ఎట్టకేలకూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ‘గుత్తా జ్వాలా’, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంట త్వరలోనే ప్రేమ వివాహాం చేసుకుంటామని ప్రకటించిన దగ్గర నుండి నెటిజన్లు ఈ పెళ్లి తంతు పై అప్ డేట్లు కోసం ఆరా తీస్తూనే ఉన్నారు. మొత్తానికి నగర శివారు మొయినాబాద్ లో ఈ జంట బంధువుల మధ్య ఒక్కటైంది. మొయినాబాద్ లోని ఎన్కేపల్లి సమీపంలోని ఓ విల్లాలో వీరిద్దరూ నిరాడంబరంగా వీరి వివాహం చేసుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వారు తమ వివాహానికి ఎక్కువమందిని ఆహ్వానించలేదు.

కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రముఖులు మాత్రమే వీరి వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో రాష్ట్ర క్రీడా, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై వధూవరులకు ఆశీస్సులను అందించారు. విష్ణు విశాల్ ‌పై తన ప్రేమను వ్యక్తపరుస్తూ.. ‘ప్రేమలో మేము బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నామని, అలాగే మాది గౌరవంతో కూడుకున్న ప్రేమ అని ఇలా తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది జ్వాలా.

ఏది ఏమైనా ఈ ఇద్దరూ ఒక ఇంటవారయ్యారు. ఇక వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. నటుడు విష్ణు విశాల్‌ 2010లో రజనీ నటరాజన్‌ ను అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పైగా వారికి ఆర్యన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, వీరి మనస్పర్థల కారణంగా 2018లో విడిపోయారు. ఇక జ్వాల కూడా గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో విష్ణు విశాల్‌ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి దాంపత్య జీవితాంతం ఆనందంగా కొనసాగాలని ఆశిద్దాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper