Indian Actor: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మైమరిపింప జేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇక వాళ్లు చేసే సినిమాలు ప్రేక్షకుల ఊహలకు కూడా అందని విధంగా ఒక వేరే ప్రపంచాన్ని సృష్టించి అందులో ప్రేక్షకుడిని బందీగా మార్చేస్తారు. ఆ సినిమాలు చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాలో లీనం అయిపోయి తన బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేనంత డీప్ గా అతన్ని ఆ సినిమాలోకి తీసుకెళ్లడం అనేది ఒక హాలీవుడ్ మేకర్స్ వల్లే సాధ్యమవుతుంది. ఇక ఇప్పటివరకు వాళ్లు చేసిన ప్రతి సినిమా కూడా గ్రాఫిక్స్ పరంగా గాని, విజువల్స్ పరంగా గాని ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతం గా ఉండడమే కాకుండా ఆ సినిమాలను చూసే ప్రేక్షకుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు…ఇక మొత్తానికైతే హాలీవుడ్ మేకర్స్ లో డేవిడ్ ఫించర్ తీసిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసిన సెవన్, ఫైట్ క్లబ్, ద కిల్లర్ లాంటి సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఆయన సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో అద్భుతాలను చేస్తూ ప్రేక్షకులందరిని మైమరిపింప చేస్తూ ఉంటాడు. నిజానికి ఈయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఆ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే లేటెస్ట్ గా ఆయన చేయబోయే సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఈ సినిమాలో హాలీవుడ్ దిగ్గజ నటులు నటించబోతున్నారు అంటూ డైరెక్టర్ స్పష్టం చేశాడు. అలాగే ఈ సినిమాలో ఇండియన్ యాక్టర్ ఒకరు కూడా అందులో క్యామియో రోల్ పోషించబోతున్నారు అంటూ హాలీవుడ్ లో ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ న్యూస్ వినగానే చాలా మంది ప్రభాస్ ఈ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. నిజానికి వాళ్ళు ఇండియన్ యాక్టర్ నటిస్తాడని రాశారు. కానీ వాళ్ళు ఎవరు అనే విషయం మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు.
ఇక ఆ హీరో ప్రభాసేనా లేదంటే బాలీవుడ్ నుంచి ఎవరైనా నటులు ఆ సినిమాలో నటించబోతున్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక ఇది తెలుసుకున్న కొంత మంది తెలుగు అభిమానులు మాత్రం ప్రభాస్ తప్ప హాలీవుడ్ సినిమాలో నటించే కెపాసిటీ ఇప్పుడున్న హీరోల్లో ఎవరికీ లేదు. బాలీవుడ్ హీరోలు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నారు. కాబట్టి వారిని పట్టించుకునే నాధుడు కూడా లేడు. ఇక హాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే అది ప్రభాస్ వల్లే సాధ్యమవుతుంది అంటూ చాలామంది తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఒక తెలుగు హీరో హాలీవుడ్ సినిమాలో అడుగు పెట్టినట్లైతే మాత్రం ఇది మనందరం గర్వించుదగ్గ విషయమనే చెప్పాలి. ఇక బాహుబలి, కల్కి సినిమాలు హాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యాయి. అలాగే ప్రభాస్ కి అక్కడ కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. చూడాలి మరి డేవిడ్ ఫించర్ ఏ ఇండియన్ ఆర్టిస్ట్ ని తన సినిమాలో తీసుకోబోతున్నాడు అనేది…